తెలంగాణా బిజెపి వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో పేదల కోసం మోదీ ఎన్నో చేశారు అని అన్నారు. ఏడేళ్లలో భారత్ ను అగ్రగామిగా నిలిపారు అని ఆయన పేర్కొన్నారు. అవినీతిరహిత పాలన అందిస్తున్నారు అని వెల్లడించారు. ఇందిరా హయాంలో గరీబీ హటావ్ నినాదం ,  నినాదంగానే మిగిలింది  అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు  అని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ హయాంలో 12 లక్షల కోట్లు స్కాంల పేరిట లూటీ చేశారు  అని విమర్శలు చేసారు.

తీవ్రవాదుల దుశ్చర్యలు ఇప్పుడు లేవు అన్నారు. అన్ని వర్గాలను మోదీ ఒప్పించి మెప్పించారు అని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రధాని అయ్యాక సర్జికల్ స్ట్రైక్ నిర్వహించారు అని వెల్లడించారు. మోదీ వచ్చాక నలబై కోట్ల రూపాయలు పేదల ఖాతాలలో వేశారు అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇటు వంటి విప్లవాత్మక కార్యక్రమాలు ఎవరూ చేయలేదు అని ఆయన తెలిపారు. అందరు నేతలు షో చేసుకోవడమే తప్ప పనులు చేయలేదు అని విమర్శలు చేసారు. కానీ మోదీ ప్రధాని అయ్యాక ఏడేళ్లలో లక్షల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్ లో పేదరికం నిర్మూలించాలన్నదే మోదీ సంకల్పం  అన్నారు ఆయన. తెలంగాణ సర్కారు మోదీ పథకాలను అమలు చేయడం లేదు అని తెలిపారు. తెలంగాణలో ఎటు వంటి ప్రభుత్వం ఉందో ప్రజలు ఆలోచించాలి అని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు అని మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలు  , ఇంటింటికీ తాగునీరు ఏమయ్యాయి అని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన నడుస్తుంది అని విమర్శించారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటుంది అని అన్నారు. కేసీఆర్ మాటలన్నీ మోసపూరితం అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ లూటీని బీజేపీ అడ్డుకుంటుంది అని అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు కేసీఆర్ ప్రభుత్వం పై పోరాడాలి అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: