2009 నుండి 2014 వరకు జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి పాలై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి మాజీ మంత్రులు ఇద్దరు వారికి అన్ని విధాలుగా అంటే ఆర్ధిక పరంగా మరియు నైతికంగా అండగా నిలబడ్డారని కొన్ని విశ్వసనీయవర్గాల సమాచారం. వీరిద్దరూ కూడా ఆ తరువాత మంత్రులయ్యారు. ప్రస్తుతానికి వారి పేర్లను బయటపెట్టలేని సందర్భం కాబట్టి కుదరడం లేదు. కానీ సమాచారం అయితే కరెక్ట్ అని తెలుస్తోంది. ఈ ఇద్దరు మంత్రులు కూడా ఒకరు కోస్తా ఆంధ్రాలోని నెల్లూరు జిల్లాకి చెందిన ఒకరు. నెల్లూరు మంత్రి ఎవరో ఈ పాటికే మీకు అర్ధమై ఉంటుంది. పల్నాడు ప్రాంతానికి చెందిన గుంటూరు మంత్రి ఒకరు.

అయితే ఆ మంత్రి  మొన్న రాత్రి దాదాపు 8.30 గంటల మధ్యన ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ దగ్గరకు వెళ్లినట్లు తెలిసింది. కాగా వీరిద్దరూ దాదాపు మూడు గంటలసేపు చర్చించుకున్నట్లు సమాచారం. సదరు మాజీ మంత్రి ముఖ్యంగా ఒక విషయంపైన చర్చించినట్లు రాజకీయవర్గాల సమాచారం. ఆ మాజీ మంత్రి ఎంపీని మీరు  కోరితే  వైసీపీలోకి వస్తాను లేదా నన్ను ఏమీ చేయకుండా వదిలేయండి. ఈ రెండు విషయాలలో ఏదో ఒకటి చేయమని ఆ ఎంపీని కోరినట్లు తెలిసింది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత టీడీపీలో ఎవరైతే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారో వారికి సంబంధించిన వకతవకలను మరియు బలహీనతలను, అలాగే వారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను వెతికి వారిపై కేసులు పెడుతున్నారు.

టీడీపీ కాలంలో నీరు చెట్టు పధకానికి సంబంధించిన విజిలెన్సు రిపోర్ట్ వచ్చింది. ఇందులో జరిగిన అవినీతిని ఇప్పుడు వెలికి తీశారు. దీనికి 9 కోట్లు అయింది. కానీ ప్రభుత్వానికి 9 కోట్లు ఆదాయం రావాలి. కానీ ఆ ఆదాయాన్ని అప్పట్లో ప్రభుత్వానికి ఇవ్వకుండా నొక్కేశారు. ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అవుతారనే భయంతో ఈ విధంగా కాళ్ళ భేరానికి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ సీఎం జగన్ ఇంకెవరినీ పెద్ద నాయకులను పార్టీలో చేర్చుకోబోమని చెప్పినట్లు తెలిసింది. కాబట్టి కనీసం అరెస్ట్ అయినా ఆపమని కోరినట్లు  తెలిసింది. ఆ ఎంపీ కూడా సరే చూద్దాంలే అన్నారట. మరి చూడాలి ఈ విషయంలో ఏమి జరగనుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: