కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆయన కేంద్ర మంత్రులను కనీసం పట్టించుకోవడం లేదు అనే ఆవేదన చాలావరకు వ్యక్తమవుతుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులతో మాట్లాడి తమకు ఏం కావాలి ఏంటి అనేది తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది అనే అభిప్రాయం చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది.

గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్ధిక సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రాలకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. కేంద్ర మంత్రులు సొంత రాష్ట్రంలో కూడా కనీసం తమ సొంత నియోజకవర్గానికి కూడా డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అనే విషయం కూడా చెప్పవచ్చు. ఇద్దరు ముగ్గురు కేంద్రమంత్రులు మినహా మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అసలు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలియదు. దేశంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నా సరే ఆమె మాట్లాడటం లేదు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కావడం లేదు. గత ఏడాది మన దేశంలోకి కరోనా అడుగు పెట్టిన సమయంలో వీళ్ళందరూ కూడా ఎక్కువగా మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. దీంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. ప్రధానమంత్రి మోడీ తీరుపై మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: