దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్‌ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కేసులు తారా స్థాయికి చేరుకుంటూ వున్నాయి.ప్రతి రోజు 4 లక్షలకు పైగా కరోనా కేసులు రికార్డవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చాప కింద నీరు లాగా కరోనా దేశంలో నలుమూలాల వ్యాప్తి చెందుతుంది. ఇక ఆక్సిజన్ కొరత కూడా చాలా ఎక్కువగా వుంది. అలాగే కరోనా మరణాలు కూడా రోజు రోజుకి చాలా ఎక్కువై పోతున్నాయి. ముఖ్యంగా పట్టణాలలో కేసులు చాలా ఎక్కువవుతున్నాయి.ఇక పట్టణాలతోపాటు ఇప్పుడు గ్రామాలలోనూ కరోనా కేసులు అలాగే మరణాలు విపరీతంగా నమోదవుతున్నాయి.అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కేసులు చాలా ఎక్కువవుతున్నాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ కి కొత్తగా బ్లాక్ ఫంగస్ సమస్య చాలా తీవ్రంగా మారి చాలా ఇబ్బంది పెడుతుంది.మొన్నటిదాకా తెలంగాణా ప్రజలను భయపెట్టిన ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా భయానికి గురి చెయ్యడం ఆందోళన కలిగించే విషయం అని చెప్పాలి.


ఇక ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఓ వ్యక్తికి ‘బ్లాక్‌ ఫంగస్‌’ లక్షణాలు కనిపించాయి. స్థానికులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం..15 రోజుల క్రితమే ఆ పేషెంట్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అయితే, ఏలూరు ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన సమయానికే బాధితుడి కన్ను వాచిపోయి ఉంది. అయితే గత వారం రోజులుగా కన్నువాపు పెరుగుతుండడంతో రాజమండ్రి, విశాఖ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయగా ఫంగస్‌ లక్షణాలు ఉన్నట్లుగా నిర్థారణ అయ్యింది. ఈ వాపు కన్నుతో పాటు, ముక్కు, మెదడుకు వ్యాపిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.


ఈ క్రమంలో నిడదవోలులోని బ్లాక్ ఫంగస్ బారిన పడిన వ్యక్తి ఇంటికి వైద్య బృందం వెళ్లింది. స్థానిక ఆర్డీఓ, వైద్య అధికారులు, నోడల్ అధికారులు.. బాధితుడితో మాట్లాడి, ల్యాబ్ రిపోర్ట్‌లు పరిశీలించారు. ఫంగస్ లక్షణాలపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేస్తామని ఆర్డీఓ వెల్లడించారు. అలాగే బాధితుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: