కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న వేళ ప్రజలందరూ టీకా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే భారీగా పాపులేషన్ ఉన్న మన భారతదేశంలో తక్కువ కాలంలో అందరికీ రెండు డోసుల టీకాలు ఇవ్వడం అనితరసాధ్యం. ప్రస్తుతం టీకాల సంఖ్య తక్కువగా ఉండటంతో చాలా మంది ప్రజలు మొదటి టీకా తీసుకొని రెండో డోసు టీకా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మొదటి డోసు తీసుకున్న ప్రజలు రెండవ టీకా తీసుకోవడానికి మరింత ఆలస్యం అవుతుందని.. దీని వల్ల ఫలితం లేకుండా పోతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.


దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా టీకాల మధ్య వ్యవధి పెరిగితే టీకాలు సమర్థవంతంగా పని చేస్తాయా లేదా అనే కోణంలో పరిశోధనలు మొదలు పెట్టింది. అయితే మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం నిపుణుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని టీకాల మధ్య వ్యవధిని పెంచడం వల్ల అవి సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా నిపుణుల ప్యానెల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తో కొవిషీల్డ్ టీకా మధ్య వ్యవధిని పెంచవచ్చని భారత ప్రభుత్వానికి రికమండ్ చేసింది.



ఈ విషయమై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టిఐజి) డాక్టర్ ఎన్. కె అరోరా మాట్లాడుతూ.. అడెనోవెక్టర్ వ్యాక్సిన్ల ప్రవర్తనను పరిగణలోకి తీసుకొని ప్రాథమిక శాస్త్రీయ ఆధారాలతో 2 కోవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధిని 4-6 వారాల నుంచి 12-16 వారాలకు పెంచవచ్చని నిర్ణయించుకున్నట్టు వివరించారు. రెండు డోసుల మధ్య వ్యవధి పెంచడం వల్ల అడెనోవెక్టర్ వ్యాక్సిన్ల పనితీరు మరింత సమర్థవంతంగా మారుతుందని నిపుణులు తెలిపారు.



యునైటెడ్ కింగ్డంలో టీకాల మధ్య పెంచిన వ్యవధిని ఆధారంగా తీసుకొని కోవిడ్-19 నిపుణుల ప్యానల్ కొవిషీల్డ్ టీకా మొదటి, రెండు డోసుల మధ్య వ్యవధిని పొడగించొచ్చని వెల్లడించింది. ఐతే కొవాగ్జిన్ టీకా డోసుల వ్యవధి విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: