తన రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపి ఆనాడు విమర్శల పాలయ్యారు ఇందిరా గాంధీ. అంతేకాదు ఎలక్షన్స్ వాయిదా వేయడం.. ప్రభుత్వంపై వ్యతిరేకతను అణిచివేత, పత్రికలపై నిబంధనలను విధించడం లాంటివి చేశారు.
1971 జనరల్ ఎలక్షన్స్ లో ఇందిరా గాంధీ అధ్యక్షతన అధికారపీఠాన్ని కైవసం చేసుకుంది హస్తం పార్టీ. 352స్థానాలను కైవసం చేసుకొని తిరుగులేని విజయం సాధించింది. అటు రాజ్యసభలోనూ కాంగ్రెస్ పార్టీకి తగినంత బలం ఉంది. ఇంత ఉన్నా ఇందిరా గాంధీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ప్రజల్లో విమర్శల పాలయ్యారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఇలాంటి సమయంలో ప్రాంతీయ పార్టీలు శక్తిని కూడగట్టుకోవడం, రాజకీయ, ఆర్థిక విషయంలో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఇందిరా గాంధీని కలవరానికి గురిచేశాయి.
భారత్ లో అత్యవసర పరిస్థితి దీనికంటే ముందే రెండు సార్లు విధించారు. అదెప్పుడంటే 1962వ సంవత్సరంలో చైనాతో యుద్ధం జరిగినపుడు, 1971లో పాకిస్థాన్ తో యుద్ధం జరిగిన సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇందిరా గాంధీ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ..1973-75 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. అందులో భాగంగానే గుజరాత్ లో నవనిర్మాణ్ ఉద్యమం జరిగింది. గుజరాత్ లో ప్రభుత్వం గద్దె దిగడంతో పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే సమయంలో లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ బీహార్ లో ఏబీవీపీ చేపట్టిన ఉద్యామానికి తన మద్దతు ప్రకటించారు. అంతేకాదు జేపీ ఇచ్చిన సంపూర్ణ క్రాంతి పిలుపుతో ప్రజలు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు దిగారు.
1971 ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి పోటీ చేసిన ఇందిరకు పోటీగా.. యునైటెడ్ సోషలిస్టు పార్టీ తరఫున రాజ్‌నారాయణ్ ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఈ ఎలక్షన్స్ లో ఇందిర.. ఎన్నికల నియమాలను ఉల్లంఘించడంతో పాటు.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయన అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా 1975, జూన్ 12న తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. ఇందిర ఎన్నికను రద్దు చేయడమే కాకుండా.. మరో ఆరేళ్లపాటు ఆమె ఎన్నికల బరిలోకి దిగొద్దని సూచించింది. దీంతో ఆమె ప్రధాని పదవిని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి