రేవంత్ రెడ్డి.... జనాల్లో మంచి పేరున్న నాయకుడు. అంతేకాదు అవసరమైనప్పుడు ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పిసిసి పీఠాన్ని కట్టబెట్టింది. మామూలు నాయకుడుగా ఉన్నప్పుడే తనదైన దూకుడును ప్రదర్శించిన రేవంత్ రెడ్డి.... ఇప్పుడు పిసిసి వచ్చాక అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. తమదైన వాక్ చాతుర్యంతో అధికార పార్టీని ఎండగడుతూ ఉన్నారు. అంతేకాదు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు దిశగా అడుగులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి పిసిసి కాగానే టిఆర్ఎస్ మరియు బిజెపి కి వెళ్ళిన పాత నేతలు... తిరిగి కాంగ్రెస్ పార్టీ బాట పట్టారు. ఇప్పటివరకూ చోటా లీడర్స్ ఆయన పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చారు. ఇంక ముందు అధికార టీఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి నుంచి పెద్ద ఎత్తున నాయకులు వస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వెంకటస్వామి కుమారులు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ మరియు బిజెపి సీనియర్ నేత జితేందర్ రెడ్డి కాంగ్రెసులోకి వస్తారని గత వారం రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి ఒకరు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ మాజీమంత్రి ఎవరో కాదు..  2014లో తెలంగాణ కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి.

2014లో టిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి... 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి పైన ఓడిపోయారు. ఆ తర్వాత గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి మధ్య వర్గ పోరు మొదలైందని తెలుస్తోంది. అలాగే పార్టీలో తగినంత ప్రాధాన్యత లభించడం లేదని... వచ్చే ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ టికెట్ రోహిత్ రెడ్డికి వస్తుందని వార్తలు అందని అందడంతో... పట్నం మహేందర్ రెడ్డి మనసు మార్చుకున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి దూకుడు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళితే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: