అరుదైన జాతుల్లో ఒకటైన నీటికుక్కలు నాగార్జున సాగర్ జలాశయాల్లో దర్శనమిచ్చాయి. ఎగువ నుంచి వరద వస్తుండటంతో జలాశయంలోని వాటర్ స్కెల్, లాంచీ స్టేషన్ సమీపంలో సంచరిస్తున్నాయి. ఇవి నీటిలోని చేపలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఉభయ చర జీవులు. అంతరించి పోతున్న అరుదైన జాతి కావడంతో వీటిని సంరక్షించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఈ నీటి కుక్కలు గతంలో కూడా కనిపించాయి. కొల్లాపూర్, మన్ననూర్ దగ్గర మత్స్యకారుల కంటపడగా.. వాటిని పట్టుకున్నారు. నెహ్రూ జులాజికల్ పార్క్ కు క్షేమంగా తీసుకెళ్లారు.

నీటి కుక్కలు చూడటానికి అచ్చం ముంగిస లాగే ఉంటాయి. ఇది పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువు. అంటే క్షీరదమన్నమాట. ఈ జీవికి సైంటిఫిక్ నేమ్ కూడా ఉంది. అదే అట్టర్. ఎక్కువ జన సంచారం లేని నీరు ఉండే ప్రాంతంలో ఇవి జీవిస్తుంటాయి. ఇవి నీటిలోనూ.. నేలపైనా బతకగలవు.


ఈ సారి వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదినే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తాయి. జనజీవనం అస్తవ్యస్తమయింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. చెట్లు కూలిపోయాయి. డ్యామ్ లు నిండిపోయాయి. దీంతో గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు అధికారులు. అలా వస్తున్న వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని డ్యామ్ లు జలకళను సంతరించుకున్నాయి. అయితే ఎగువ నుంచి వస్తున్న వరదలతో నల్గొండ జిల్లాలోని నాగార్జు సాగర్ నీటిమట్టం అమాతం పెరిగిపోయింది. అంతా బాగుంది కానీ ఆ నీటిలో నీటి కుక్కకు దర్శనమివ్వడం పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఇవి మొదట చూసినప్పుడు ఏవో కొత్త జీవులు అనుకున్నారు. ఆ విషయం అధికారులకు తెలియడంతో వాటిని నీటికుక్కలుగా తేల్చారు.

అయితే మీకూ చూడాలని ఉందా.. అయితే ఒక్కసారి నాగార్జున సాగర్ కు వెళ్లి రండి.. ఆ నీటి కుక్కలను చూసి మీరు ఎంజాయ్ చేయండి.

 



 

మరింత సమాచారం తెలుసుకోండి: