ఇకపోతే ఇక ప్రస్తుతం ఎక్కడికి వెళ్లినా ఎలాంటి కార్య కలాపాలు జరిపిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడం ఇక డబ్బులు పంపించడం లాంటివి చేస్తున్నారు ప్రతి ఒక్కరు. పెద్ద పెద్ద జ్యూయలరీ షాపుల దగ్గర నుంచి బడ్డీ కొట్టు వరకు కూడా ప్రస్తుతం ఇలా అన్ని చోట్లా క్యూఆర్ కోడ్ దర్శనమిస్తున్నాయి. ఇలా ప్రతి ఒక్కరు కూడా అప్ డేట్ అయి పోతున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి కూడా అప్డేట్ అయి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. సాధారణం గా ఊర్లోకి బసవన్న ఆటలాదించే వారు వస్తారు బసవన్న తో ఆడించి ఎంతో కొంత డబ్బులు తీసుకుంటూ ఉంటారు.
కానీ ఇక ఇటీవలే బసవన్న లు ఆడించే వ్యక్తి కూడా అప్డేట్ అయ్యాడు ఏకం గా ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసుకుని అది బసవన్న తలపై పెట్టి ఊరు తిరుగు తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోయింది. ఇక ఈ ఫోటో చూసిన వాళ్ళు వామ్మో అతను కూడా అప్డేట్ అయి పోయాడు గా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి