ఇప్పుడు ఎవ‌రికి ఎలాంటి సందేహం ఉన్నా.. ఎలాంటి అనుమానం వ‌చ్చినా.. వెంట‌నే అడిగేది.. గూగుల‌మ్మ నే. త‌మ‌కు ఎలాంటి సందేహంవ‌చ్చినా.. వెంట‌నే స‌ద‌రు సందేహంపై గూగుల్‌లో సెర్చ్ చేయ‌డం కామ‌న్‌. గ‌తంలో హైకోర్టు న్యాయ‌మూర్తి ఒక‌రు ఒక నెంబ‌రు చెప్పి... దీనిని తాను గూగుల్‌లో వెతికాన‌ని.. వెంట‌నే జ‌గ‌న్ చ‌రిత్ర బ‌య‌ట ప‌డింద‌ని చెప్పారు. అంతేకాదు.. తుగ్ల‌క్ అని గూగుల్‌లో సెర్చ్ చేసినా.. వెంట‌నే ఏపీ ప్ర‌భుత్వంపై వివరాలు వ‌స్తున్నాయి. ఇలా.. ఎవ‌రికి ఎలాంటి సందేహం వ‌చ్చినా.. వెంట‌నే గూగుల్ ను అడుగుతున్నారు. సెర్చ్ ఇంజ‌న్‌లో దాదాపు కోటి ప‌దాలకు పైగానే అర్ధాలు ఉన్నాయి.

వివిధ భాష‌లు.. వివిధ ప్రాంతాల‌కు సంబంధించిన స‌మాచారం గూగుల్ సెర్చ్ ఇంజ‌న్‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా గూగుల్ సెర్చ్ ఇంజ‌న్‌లో గ‌త 24 గంటల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన‌.. ప‌దం `బోష్‌డీకే` ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజం. మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లో టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి.. చేసిన ఈ కామెంట్‌పై తీవ్ర రాజ‌కీయ ర‌గ‌డ ప్రారంభ‌మైంది. మా ముఖ్య‌మంత్రినేఅంత మాట అంటావా.. అంటూ.. వైసీపీ ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వ‌రకు ఫైర‌య్యారు. ఈ క్ర‌మంలో కొంద‌రు ఎమ్మెల్యేలు పార్థ‌సార‌థి, వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ వంటివారు ప‌లువురు .. చంద్ర‌బాబునే నేరుగా బోష్‌డీకే అంటే అర్ధం తెలుసా? అని ప్ర‌శ్నించారు.

అయితే.. దీనికి ఎవ‌రూ అర్ధం చెప్ప‌లేక పోయారు. దీంతో భారీ సంఖ్య‌లో ఈ ప‌దానికి అర్ధాన్ని చెప్ప‌మంటూ.. గూగూల్ సెర్చ్ ఇంజ‌న్‌లో సెర్చ్ చేశారు. అయితే.. దీనికి భిన్న‌మైన స‌మాధానం వ‌చ్చింది. ఇది సంస్కృత ప‌ద‌మ‌ని.. దీనికి అర్ధం మీరు బాగున్నారా? అని.. గూగుల్ పేర్కొంది. ఇదే విష‌యాన్ని వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ రాజు కూడా పేర్కొన్నారు. . బోసడీకే అంటే తిట్టు కాదని తేల్చారు. బోసడీకే అంటే అర్థం ‘మీరు బాగున్నారా’ అని గూగుల్‌లో ఉందని రఘురామ తెలిపారు.

‘‘టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్న ఈ పదానికి అర్థం ఏంటా? అని నా స్నేహితులు పాతికమందిని అడిగా. వైసీపీలోని నా అజ్ఞాత స్నేహితులను కూడా అడిగా. ‘ఏమో మాకూ తెలీదు.. ఏదో బూతు పదమేమో’ అని చెప్పారు. అప్పుడు నేను గూగుల్‌లో వెతికా. అందులో చాలా స్పష్టంగా ఉంది. ‘సర్.. మీరు బాగున్నారా’ అనేది సంస్కృతంలో బోసడీకే అనేదానికి అర్థం.’’ అని రఘురామ రాజు వివరించారు.

అయితే.. ఇది నెటిజ‌న్ల‌ను సంతృప్తి ప‌ర‌చ‌లేదు. ఎందుకంటే.. అత్యంత ఆగ్ర‌హంతో ప‌ట్టాభి సంధించిన ఆ ప‌దానికి ఇదా అర్ధ‌మ‌ని పెద‌వి విరుస్తున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికీ.. గూగుల్ కూడా దీనికి స‌రైన స‌మాధానం చెప్పలేదు. వాస్త‌వానికి బోష్ డీకే ప‌దం ఉర్దూ అని అంటున్నారు. అయితే.. ఉర్దూలోనూ దీనికి సరైన అర్ధం లేక పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి అర్ధం మాత్రం దొర‌క‌క‌పోవ‌డం.. గూగుల్‌లో భారీ సంఖ్య‌లో సెర్చ్ చేసిన ప‌దం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీని అర్ధ‌మేంటో ఎవ‌రైనా త‌ర్వాతైనా చెబుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: