రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్తితులు ఉన్నా సరే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీని దాటి వేరే పార్టీలు గెలవడం కష్టం. ఎందుకంటే రాష్ట్రంలో టీడీపీకి చాలా కంచుకోటలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అంతటి జగన్ గాలిలో సైతం పలు నియోజకవర్గాల్లో టీడీపీ సత్తా చాటింది...అంటే అవి టీడీపీకి మొదట నుంచి కంచుకోటలుగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే అలాంటి కంచుకోటల్లో ఓ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి కాస్త దిగజారుతున్నట్లు కనిపిస్తోంది.

వైసీపీ అధికారంలో ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ హవా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు సైతం అంతగా ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడం కూడా మైనస్ అవుతుంది. ఇక ఆయా నియోజకవర్గాల్లో టీడీపీని ఏదొరకంగా దెబ్బతీయాలనే విధంగా వైసీపీ పావులు కదుపుతుంది. ఫలితంగా కొన్నిచోట్ల టీడీపీ కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలా టీడీపీ వీక్ అయిన కంచుకోటలు వచ్చి ఇచ్చాపురం, విశాఖ ఈస్ట్, ఉండి నియోజకవర్గాలు.

ఇచ్చాపురం అంటే టీడీపీకి తిరుగులేని నియోజకవర్గం...ఇక్కడ పార్టీ 8 సార్లు గెలిచింది. గత ఎన్నికల్లో బెందాళం అశోక్..జగన్ గాలిని సైతం తట్టుకుని విజయం సాధించారు. అయితే వైసీపీ అధికారంలో రావడం...అక్కడ వైసీపీ నేత సిరాజ్ దూకుడుగా పనిచేస్తుండటంతో కాస్త ఇచ్చాపురంలో రాజకీయ పరిస్తితులు మారినట్లు కనిపిస్తున్నాయి. ఇటు ఎమ్మెల్యే కూడా స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది. ఇవన్నీ టీడీపీకి మైనస్ అవుతున్నాయి.

అటు విశాఖ ఈస్ట్ నుంచి వెలగపూడి రామకృష్ణ వరుసగా మూడుసార్లు నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఈయన్ని దెబ్బకొట్టడానికి వైసీపీ వేయని ఎత్తులు లేవు. ఈయన ప్రజల కోసం బాగానే కష్టపడుతున్నారు. కానీ దానికి మించి వెలగపూడికి వైసీపీ చెక్ పెట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఈస్ట్‌లో టీడీపీ కాస్త గడ్డు పరిస్తితులు ఎదురుకుంటుంది.

అటు మరో కంచుకోట అయిన ఉండిలో కూడా టీడీపీకి అంతా అనుకూల వాతావరణం కనిపించడం లేదు. అయితే ఇంకా ఎన్నికలకు రెండున్నర ఏళ్ల సమయం ఉంది కాబట్టి, ఈ కంచుకోటల్లో మళ్ళీ టీడీపీ పుంజుకునే అవకాశాలు లేకపోలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: