ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల కు మ‌ధ్య చాలా గ్యాప్ ఉంద‌నే ప్ర‌చారం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రుగుతూ వ‌చ్చింది. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి వ‌చ్చే ఎన్నిక ల‌లో అధికారంలోకి రావాల‌న్నా.. పార్టీ ఇమేజ్ పెంచాల‌న్నా ఎమ్మెల్యేల‌ను , పార్టీ నేత‌ల‌ను ఎంత మాత్రం నమ్ముకున్న ప‌రిస్థితి లేదు. జ‌గ‌న్ మ‌రీ వ‌న్ సైడ్ గా వెళ్లిపోయారు. అసలు పార్టీ ఎమ్మెల్యేల కు , ఎంపీ ల‌కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌లేదు. దీంతో చాలా మంది త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను కూడా చెప్పుకోలేని ప‌రిస్థితి.

అయితే ఇప్పుడు జ‌గ‌న్ కు ఎమ్మెల్యే ల‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగి పోవ‌డంతో వారు కూడా త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నులు చేయ‌డం మానేశారు.ఈ గ్యాప్ ఇలాగే పెరిగి పోతే చాలా మంది ఎమ్మెల్యే ల‌పై ప్ర‌జ‌ల్లోనూ తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త పెరిగి పోయేలా ఉంది. దీంతో జ‌గ‌న్ ఈ విష‌యంలో రూటు మార్చారు. ఇక‌పై ఆయా నియోజ‌క‌వ‌ర్గా ల్లో ప‌రిస్థితు ల‌తో పాటు .. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పుడు ఎమ్మెల్యేల‌ను క‌లిసి వారి స‌మ‌స్య‌లు వినేందుకు ప్ర‌త్యేకంగా టైం కూడా కేటాయిస్తున్నారు. మ‌రో వైపు జ‌గ‌న్ జిల్లాల పర్యటనకు కూడా రెడీ అవుతున్నారు. జ‌గ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి స్థానికంగా స‌మ‌స్య‌లు తెలుసు కుంటే జ‌గ‌న్ కు గ్రౌండ్ లెవ‌ర్ ప‌రిస్థితి అర్థ‌మ‌వుతుంది. ఇక‌పై ప్రాంతాల వారీగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేల తో కూడా భేటీ కానున్నారు. ఇక ర‌చ్చ బండ కార్య‌క్ర‌మం ద్వారా ఏపీ లో ఉన్న అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క రిస్తాన‌ని. పాద‌యాత్ర‌లో తాను ఇచ్చిన హామీలు నెర వేర్చుందుకు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని జ‌గ‌న్ ఎమ్మెల్యే ల‌తో చెపుతున్నార‌ట‌. ఏదేమైనా జ‌గ‌న్ త‌మ కు టైం కేటాయిస్తుండ‌డం ఎమ్మెల్యేల‌కు కూడా ఉత్సాహం ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: