ఆంధ్ర ప్రదేశ్లో కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి ఎంత కంచుకోట ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. పార్టీ అధికారంలో ఉన్నా ... ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ కృష్ణా జిల్లా ప్ర‌జ‌లు తెలుగుదేశం వెంటే నిలుస్తూ వచ్చారు. పార్టీ ఆవిర్భవించిన 1983 నుంచి 2004 ఎన్నికల వరకు జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. 1989 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. అయనా కూడా కృష్ణా జిల్లా అవనిగడ్డ - జగ్గయ్యపేట - కంకిపాడు లాంటి నియోజకవర్గాల్లో విజయాలు నమోదు చేసింది. వంగవీటి రంగా హత్య తర్వాత జరిగిన 1989 ఎన్నికల్లో కూడా కృష్ణా జిల్లాలో టీడీపీకి బలంగా ఓట్లు పడ్డాయి.

అయితే 2004 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ కేవలం గుడివాడ - నందిగామ సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం , కాంగ్రెస్ ల‌ను టీడీపీ పూర్తిగా డామినేట్ చేసేసింది. ఆ ఎన్నికల్లో జిల్లాలో ప్రజా రాజ్యం 2, కాంగ్రెస్ ఆరు సీట్లకు పరిమితం అయితే తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం ఎంపీ సీటుతో పాటు ఏకంగా ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది.

2014 ఎన్నికల్లో తిరిగి జిల్లాలో మరోసారి టిడిపి ఆధిపత్యం నిలిచింది. విజయవాడ - బందరు రెండు ఎంపీ సీట్లు టిడిపికి ఖాతాలోనే పడ్డాయి. 2019 ఎన్నికల్లో మాత్రం కేవలం గన్నవరం - విజయవాడ తూర్పు లో మాత్రమే టిడిపి విజయం సాధించింది. రాజధాని వికేంద్రీకరణ తో పాటు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో టిడిపి పుంజుకుంది. అయినా కూడా తిరువూరు - విజయవాడ నియోజకవర్గాల్లో మాత్రం టిడిపి వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు.

తిరువూరులో టిడిపి చివరిసారిగా 1999లో గెలిచింది. విజయవాడ ప‌శ్చిమం లో పార్టీ ఆవిర్భవించిన 1983  ఎన్నికల్లో మినహా .. మ‌రెప్పుడూ విజయం సాధించలేదు. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ తరఫున బలమైన అభ్యర్థులు లేరు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్క‌డ టీడీపీ విజయం సాధించే అవకాశాలు కనపడటం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: