ఇక గత ఎన్నికల ముందు ఈయన ఆపరేషన్ గరుడ అంటూ...గరుడ పురాణం అంటూ హడావిడి చేసిన విషయం తెలిసిందే. ఏపీపై కేంద్రం ప్రభుత్వం కుట్రలు చేస్తుందంటూ పరోక్షంగా మాట్లాడుతూ వచ్చారు. కానీ శివాజీ చెప్పినట్లు జరిగిందో లేదో కూడా తెలియదు. ఎన్నికల్లో గెలిచి అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కొన్ని రోజుల పాటు శివాజీ ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించలేదు.
కానీ జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాక...అమరావతి రైతులకు మద్ధతుగా నిలిచారు. ఇక అప్పటినుంచి...అప్పుడప్పుడు ఏపీ రాజకీయాల్లోకి రావడం...జగన్‌పై విమర్శలు చేయడం...చంద్రబాబు ఉంటే రాష్ట్రం ఎక్కడికో వెళ్లిపోయేది అంటూ మాట్లాడటం చేస్తూ వస్తున్నారు. ఇటీవల కూడా అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉంటున్నారు. అలాగే తాజాగా కూడా తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభలో శివాజీ కాస్త ఘాటుగానే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
అయితే ఈయన రాజకీయాలని కరెక్ట్‌గా గమనిస్తే..పరోక్షంగా టీడీపీ కోసం పనిచేస్తున్నారని అర్ధమవుతుంది. రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కడికి అది తెలుస్తోంది. మళ్ళీ టీడీపీని అధికారంలో చూడటానికి శివాజీ గట్టిగానే కష్టపడుతున్నారు. అలాగే ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని చెబుతున్నారు. ఖచ్చితంగా బరిలో ఉంటానని అంటున్నారు...కాకపోతే ఇండిపెండెంట్‌గా కంటే..టీడీపీ నుంచే బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా గుంటూరు జిల్లాలో ఏదొక సీటు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికైతే టీడీపీలోనే శివాజీ సీటు కన్ఫామ్ అయ్యేలా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి