అనర్గళమైన ప్రసంగాలకు పెట్టింది పేరు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఏ టాపిక్ మీద అయినా సరే... తనదైన శైలిలో మాట్లాడగలరు. ఏ మాత్రం తడబాటు లేకుండా ప్రసంగించడంలో ఆయనకు ఆయనే సాటి. అది నలుగురి మధ్యలో అయినా, నాలుగు లక్షల మంది పాల్గొన్న బహిరంగ సభ అయినా... 40 కోట్ల మంది లైవ్‌లో వీక్షించే వర్చువల్ మీటింగ్ అయినా సరే... ఎలాంటి తొందరపాటు, తత్తరపాటు అనేది ఆయన మాటల్లో ఏ మాత్రం కనిపించదు. ఆయన మాటలు విన్నా... ఆయన హావభావాలు చూసినా సరే... వావ్... ఆయనకు ఎంతటి అమోఘమైన జ్ఞాపక శక్తి, పరిజ్ఞానం అనేస్తారు కూడా. కానీ ఇదంతా ప్రస్తుతం ఒక్కసారిగా పఠాపంచలు అయిపోయింది. దీంతో ఇప్పటి వరకు ఆయనపై ఉన్న ఇంప్రెషన్ అంతా కూడా తేలిపోయింది. ఇక విపక్షాలు కూడా ప్రధాని మోదీ గారి పరిజ్ఞానం ఇంతేనా అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సును ఉద్దేశించి మోదీ వర్చువల్ మీట్‌లో ప్రసగించారు. అయితే సరిగ్గా మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ఎదురుగా ఉన్న టెలిప్రాంప్టర్ ఆగిపోయింది. ఇక అంతే... ప్రధాని ప్రసంగం కూడా అక్కడే బ్రేక్ పడింది. ప్రాంప్టర్ ఆగిపోవడంతో... ఏం మాట్లాడాలో అర్థం కాక మోదీ అయోమయానికి గురయ్యారు. ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు.

ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. మోదీ ప్రసంగానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. ఇక కొంతమంది అయితే... ఈ ప్రసంగం సమయంలో మోదీ చూపించిన చికాకు ఫోటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇక విపక్ష నేతలు అయితే తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. టెలిప్రాంప్టర్ లేకుండా ప్రధాని ఏం మాట్లాడలేరంటూ తాము ముందు నుంచి చెబుతున్న మాటలు ఇప్పుడు నిజమయ్యాయంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, లోక్ సభ సభ్యులు రాహుల్ గాంధీ అయితే.... మరో అడుగు ముందుగు వేశారు. మోదీపై సెటైర్లు కూడా వేస్తున్నారు. నరేంద్ర మోదీ చెప్పే అబద్ధాలను టెలిప్రాంప్టర్ కూడా స్వీకరించలేకపోయిందంటూ విమర్శలు చేశారు రాహుల్. నరేంద్ర మోదీ టెలిప్రాంప్టర్ ప్రధాని అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ పెట్టారు. మోదీ అబద్ధాలను బయటకు చూపించేందుకు కూడా ప్రాంప్టర్‌కు ఇష్టం లేదంటూ ఎద్దేవా చేశారు లోకేష్. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. ఇక సోషల్ మీడియాలో మోదీ పేరు ట్రెండింగ్‌లో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: