ఎన్టీఆర్ అనే మూడ‌క్షరాల ఆవేశాన్ని ఆత్మ‌భిమానాన్ని జ‌గ‌న్ అర్థం చేసుకున్నారు. చంద్ర‌బాబు అర్థం చేసుకోలేదు.అందుకే జ‌గ‌న్ కు పొలిటిక‌ల్ మైలేజీ రోజురోజుకూ పెరుగుతోంది.అదే బాబుకు జ‌గ‌న్ కు ఉన్నంత పేరు కానీ ఇమేజ్ కానీ జ‌నం నుంచి రావ‌డం లేదు అన్న‌ది ఓ విమ‌ర్శ. అందుకే జ‌గ‌న్ తాను చేసే ప్ర‌తిప‌నిలో అయితే సానుభూతి లేదా వివాదం ఏదోఒక‌టి కోరుకుంటున్నారు. వివాదాలు వ‌చ్చినా కూడా జ‌గ‌న్ ఇమేజీ పెరుగుతూనే ఉంది. అందుకే ఆయ‌న ఈ రెండు ప‌దాల‌ను తెగ ఇష్టంగా చూస్తున్నారు.వాటి చుట్టూనే రాజ‌కీయం న‌డుపుతున్నారు.ద‌టీజ్ జ‌గ‌న్...అనిపించుకుంటున్నారు.


ఎన్టీఆర్ కు ఒక న్యాయం, ఎర్ర‌న్నాయుడికి మ‌రో న్యాయ‌మా అని అడుగుతున్నారు తెలుగు త‌మ్ముళ్లు.శ్రీ‌కాకుళం జిల్లాకు ఎప్ప‌టి నుంచో ఎర్ర‌న్నాయుడి పేరు పెట్టాల‌ని డిమాండ్ ఉంది. దివంగ‌త నేత ఎర్ర‌న్నాయుడు ఇక్క‌డి నుంచి దేశ రాజ‌ధాని వ‌ర‌కూ ఎదిగి ఎంతో పేరు తెచ్చుకున్నార‌ని వారి పేరు పెడితే స‌ముచితంగా ఉంటుంద‌ని తెలుగు త‌మ్ముళ్లు ఎప్ప‌టి నుంచో అడుగుతూనే ఉన్నారు.కానీ వారి మాట‌ను వినిపించుకునే స్థితిలో జ‌గ‌న్ లేరు.దీంతో రానున్న రోజుల్లో ఈ ప్ర‌తిపాద‌న‌ను ఒడ్డెక్కించేందుకు వీల్లేద‌ని తేలిపోయింది. పొలిటిక‌ల్ లాబీయింగ్ ద్వారా మాత్ర‌మే సాధ్య‌మ‌ని కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ తో మాట్లాడేందుకు  టీడీపీ త‌ర‌ఫున ఎవ్వ‌రూ పెద్ద‌గా సాహ‌సించ‌డం లేదు అలానే ఇష్ట‌ప‌డ‌డం లేదు కూడా!

ఇక ఎన్టీఆర్ పేరు విజ‌య‌వాడ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని జిల్లాగా ప్ర‌క‌టించి, ఆ ప్రాంతానికి దివంగ‌త నేత పేరును నిర్ణ‌యించి జ‌గ‌న్ స‌ముచిత స్థాన‌మే ఇచ్చారు.ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అన్న పేరు ఇక‌పై మార్మోగిపోనుంది.అదేవిధంగా ఆ జిల్లా నేత‌లు కూడా ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.వైసీపీ మాత్ర‌మే ఈ ప‌ని చేయ‌గ‌లిగింది అని, టీడీపీ ఉన్న‌న్నాళ్లూ ఇలాంటి ప్ర‌తిపాద‌న‌లు ఉన్నా కూడా ప‌ట్టించుకోలేద‌ని పార్టీల‌కు అతీతంగా ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


రాజ‌కీయంగా చూసుకున్నా చంద్ర‌బాబు క‌న్నా జ‌గనే ఎక్కువ‌గా ఎన్టీఆర్ ను ప‌ట్టించుకున్నారు అన్న‌ది నిర్వివాదం. ఎందుకంటే ఆయ‌న ఎప్ప‌టి నుంచో ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు పెట్టాలని అనుకుంటున్నాన‌ని పాద‌యాత్ర‌లోనే చెప్పారు.అదే మాట ఇప్పుడు అమలు చేస్తున్నారు.ఓ విధంగా టీడీపీకి ఇది ప్రాణ సంక‌ట‌మే కానీ పైకి ఏమీ అన‌లేరు.అందుకనే జ‌గ‌న్ ను ప్ర‌శంసిస్తూ కానీ క‌నీసం అభినందిస్తూ కానీ ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా టీడీపీకి చెందిన నాయ‌కులు స్టేట్మెంట్లు ఇవ్వ‌లేదు. ఇవ్వ‌లేదు కాదు ఇవ్వకుండా చంద్ర‌బాబు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.ఇక  రామారావు ఫ్యామిలీ నుంచి కూడా ఎటువంటి ప్ర‌క‌ట‌న‌లూ రాకుండా
త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఇవ‌న్నీఫ‌లించ‌డం కొస‌మెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp