రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ  బండి సంజయ్ అడ్వాన్సుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కెసిఆర్ ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా బిజెపి మరియు టీఆర్ఎస్ మధ్య పచ్చిగడ్డి వేస్తే మండిపోయే అంత గొడవ జరుగుతుంది. కేంద్ర సర్కార్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. దానికి ధీటుగా బీజేపీ కౌంటర్ కూడా ఇస్తోంది. 2022 ఫిబ్రవరి 16వ తేదీన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విలేకరులతో మాట్లాడారు.

 బిజెపి చేస్తున్నటువంటి పనులకు  అందరు నాకు ఆకర్షితులై తెరాసపై పోరాటం చేయడానికి బీజేపీలో చేరిన నేతలకు స్వాగతం పలుకుతున్నట్లు ఆయన తెలియజేశారు. తెరాస ముక్త్ తెలంగాణ కొరకు యువ తెలంగాణ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం అయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయడానికే కేసీఆర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు. చర్చలో నిలవడానికి సర్జికల్ స్ట్రైక్, రాజ్యాంగం అనే మాటలు మాట్లాడుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మంచి వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్ గురించి సీఎం చేసినవీ తప్పుడు వ్యాఖ్యలని, దీనికి కెసిఆర్ క్షమాపణ చెప్పాలని

 డిమాండ్ చేశారు. ప్రపంచానికి ఉద్యమ స్ఫూర్తిని నింపిన ప్రాంతం తెలంగాణ, బలిదానాలు, తెగించి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కానీ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన జయశంకర్ ను సీఎం కేసీఆర్ మర్చిపోయారని తీవ్రంగా విమర్శలు చేశారు. జయశంకర్ లేకపోతే ప్రత్యేక తెలంగాణ వచ్చేది కాదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు హామీలు సమస్యలు గుర్తుకు వస్తాయని, ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా మోటార్ల మీటర్లు పెడతారని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. విద్యుత్ మోటార్ల విషయంపై కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారని,  విద్యుత్ చట్టాల విషయంలో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: