ఇటీవలి కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడో జరిగిన చిత్రవిచిత్రమైన ఘటనలు క్షణాల వ్యవధిలో  అరచేతిలో వాలి పోతున్నాయి. ఇలా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయే ఘటనలో ఎన్నో ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన ఒకటి  అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.. ఇంతకీ ఇప్పుడు వైరల్ గా మారిన  ఘటన ఏంటి అంటారా.. ఒక వ్యక్తి తనకు ఇష్టమైన బైక్ కొనుగోలు చేశాడు. సరే కొనుగోలు చేసాడు ఇందులో కొత్తేముంది అని అనుకుంటున్నారు కదా.


 అతను కొనుగోలు చేసిన తీరు చూస్తే మాత్రం చాలా కొత్తగా విచిత్రంగా కూడా అనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా సరే తమ దగ్గరున్న డబ్బులతో బైక్ కొంటారు. లేదా ఈఎమ్ఐ లో బైక్ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి అలాగే బైక్ కొన్నాడు. కానీ అందరిలా నోట్ల కట్టలతో కాదు చిల్లర తో. ఊరుకోండి బాసు చిల్లర తో  ఎవరైనా బైక్ కొంటారా అని అంటారా.. అయితే అతని దగ్గర ఊహించని రేంజిలో చిల్లర ఉంది ఏకంగా బ్యాగుల్లో చిల్లర తీసుకొచ్చి మరీ కొన్నాడు. అందుకే ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 బ్యాగుల నిండా చిల్లర మొత్తం పోగుచేసి ఆ మొత్తాన్ని తీసుకొని టు వీలర్ బైక్ కొనుగోలు చేసేందుకు షో రూమ్ కి వెళ్ళాడు వ్యక్తి. అసోంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హరిదాసు అనే వ్యక్తి ఒక వీడియో ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా ఇది కాస్త వేగంగా మారిపోయింది. ఒక వ్యక్తి షో రూమ్ కి రాగానే కస్టమర్ వచ్చాడు అని అందరూ అనుకున్నారు. ఇక తనకు నచ్చిన బైక్ కలర్ కూడా ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న బ్యాగ్స్ సిబ్బందికి ఇచ్చాడు. చిల్లర ఉండడం చూసి సిబ్బంది  షాక్ అయ్యారు. ఎంతో కష్టపడి చిల్లర లెక్క పెట్టారు. ఇక చివరికి అతనికి బైక్ అప్పగించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: