తన అజ్ఞానంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇపుడు నవ్వులపాలవుతున్నారు. తనను తాను చాలా ఎక్కువగా అంటే ముఖ్యమంత్రి అయిపోయినట్లే పవన్ ఊహించుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడుపెట్టినా గెలుపు తనదే అని, ప్రభుత్వం ఏర్పాటుచేయబోయేది తానే అనే భ్రమల్లో బాగా ముణిగిపోయారు. దీంతోనే అసలు సమస్య వచ్చిపడింది. పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తేనే ఇటు బీజేపీతో అయినా అటు టీడీపీతో అయినా పొత్తుంటుందని జనసేన వర్గాలు స్పష్టంచేయటం వెనుక అజ్ఞానమే తప్ప మరోటి కనబడటంలేదు.






జనసేన నేతలే అజ్ఞానంలో కొట్టిమిట్టాడుతున్నారని అనుకుంటే పొరబాటే. ఎందుకంటే తాజాగా ప్రకటించిన మూడు ఆప్షన్లలో కూడా తానే సీఎం అభ్యర్ధిగా అనుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పుకున్నారు. ఇక్కడే ఒక విషయం చాలామందికి అర్ధం కావటంలేదు. అదేమిటంటే పవన్ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే ఏమవుతుంది ? ఏమవుతుందంటే ఏమీ కాదనే సమాధానం చెప్పుకోవాలి.






ఎందుకంటే ముఖ్యమంత్రి అభ్యర్ధి అనగానే జనాలంతా వచ్చి ఓట్లేసేంత సీన్ పవన్ కు లేదని మొన్నటి ఎన్నికలోనే తేలిపోయింది. మొన్నటి ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకునే పోటీచేశారుకదా. అంటే 137 సీట్లకు పోటీచేసిన జనసేన అధినేత పవనే కదా ముఖ్యమంత్రి అభ్యర్ధి. మరపుడు జనసేనకు జనాలు ఎందుకు ఓట్లేయలేదు. జనసేనకు ఓట్లేయకపోగా స్వయంగా రెండుచోట్లా పవన్ను ఓడించేశారు. అంటే ప్రజాప్రతినిధిగా పవన్ను పనికిరావని జనాలు తిరస్కరించినట్లే కదా.





ఒకసారి జనాలు ఓట్లేయకుండా తిరస్కరించిన వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినంత మాత్రాన ఏమీకాదు. ముందు ఏదో నియోజకవర్గంలో ఎంఎల్ఏగా గెలిచే విషయాన్ని పవన్ ఆలోచించుకోవాలి. ఎంఎల్ఏగానే గెలవలేని వ్యక్తి ఏకంగా సీఎం అభ్యర్ధిగా తనను ప్రకటించాలని రెండుపార్టీలను డిమాండ్ చేస్తుండటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. జనాల్లో విశ్వసనీయత సంపాదించుకుంటే, ఎంఎల్ఏగా గెలిస్తే అప్పుడు అందరు పవన్ను గౌరవిస్తారు. అంతేకానీ కొందరు అభిమానులు సీఎం సీఎం అని అరవటాన్ని బాగా తలకెక్కించుకునేసి తానే నెక్స్ట్ సీఎం అని భ్రమల్లో బతుకుతుంటే ఎవరు ఏమీ చేయలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: