రెండు తెలుగు రాష్ట్రలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది.ఇక తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కు, ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో 175 నుండి 225 వరకు పెంచాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని నిబంధనను అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పర్యావర నిపుణులు ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులైన యూనియన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్‌కు నోటీసులు జారీ చేయాలని కోరింది. ఈ సంవత్సరం ప్రారంభంలో జమ్మూ, కశ్మీర్‌లో డీలిమిటేషన్ ప్రక్రియను సవాలు చేసిన WP(C) 237/2022తో ఈ WPని ట్యాగ్ చేయవచ్చని కూడా ఆదేశించింది. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 లో పొందుపరిచిన విధంగా జమ్మూ-కశ్మీర్ లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 83 నుంచి 90 వరకు పెంచేందుకు 2020లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఉత్తర్వును జతచేస్తూ ఓయూ రాజకీయ శాస్త్ర విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.


ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుదల, ఆంధ్రప్రదేశ్ చట్టంలోని సెక్షన్ 26 లోని నిబంధన, రాజ్యాంగంలోని 170 వ అధికరణలోని నిబంధనలకు లోబడి ఉండాలని ఉందని, అందువల్ల 2031 తరువాత జరిగే జనాభా సంఖ్యా అందుబాటులోకి వచ్చే వరకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచే అవకాశం ఉండదని కేంద్రం తెలపిందని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే.. సుప్రీం కోర్టు విచారణ తర్వాత రెండు అవకాశాలు ఉంటాయి. మొదటిది, కశ్మీర్ లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజ్యాంగం, చట్టాన్ని ఉల్లంఘించినట్లు తీర్పు రావచ్చు. అప్పుడు కశ్మీర్ లో ఇప్పటికే ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలి. రెండోది.. కశ్మీర్ లో సీట్ల సంఖ్యను పెంచే ప్రక్రియతో ముందుకు సాగడానికి అవసరమైన రాజ్యాంగ, చట్టబద్ధమైన సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లయితే, అది రెండు తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను పెంచే ప్రక్రియకు మార్గం సుగమం చేస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం గతంలో కీలక వ్యాఖ్యలు చేసింది. 2026 వ సంవత్సరం వరకు వేచి చూడాల్సిందేనని చెప్పింది. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే, రాజ్యాంగ సవరణ అవసరమని అంతవరకు సీట్ల సంఖ్యను పెంచలేమని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 15 కు లోబడి, ఏపీలో 225, తెలంగాణలో 153 స్థానాలకు పెరుగుతాయని కేంద్రమంత్రి నిత్యానందరాయ్‌  చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: