ఏపీలో ప్రస్తుతం రాజకీయ నాయకుల అందరి దృష్టి కూడా 2024 లో జరగబోయే ఎన్నికల మీదనే నెలకొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మరియు ప్రతి పక్షంలో ఉన్న టీడీపీ లు పోటీ పోటీగా ఎన్నికల కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ రెండు పార్టీలలో ఒకటి అధికారంలోకి వస్తాయన్నది రాజకీయ ప్రముఖుల అభిప్రాయం. కానీ 2024 ఎన్నికల్లో మాకు గెలిచి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేకపోలేదని అంటూ ముందుకు వస్తోంది పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ... అయితే ప్రతి ఒక్క జన సైనికుడి మనసులో పవన్ సీఎం కావాలని బలంగా కోరుకోవడం మాత్రమే కాకుండా... అందుకు చేయాల్సినది అంతా చేస్తూ ప్రజలకు చేరువ అవుతున్నారు .

వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయడం పక్కా అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మరోక ముఖ్యవిషయం చర్చ లోకి వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నారట. అయితే ఏ పార్టీ నుండి వస్తారు అన్నది క్లారిటీ లేదు.. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్నికలకు ఆరు నెలల సమయం ముందు జనసేన లోకి ఎంట్రీ ఇచ్చి... తమ్ముడు పవన్ కి అండదండగా ఉంటూ ప్రచారంలో చురుకుగా పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. అందుకు తెర వెనుక జరగాల్సిన అన్నీ జరిగిపోతున్నాయట. ఈ విషయంలో బీజేపీ చొరవ కూడా ఉందని తెలుస్తోంది.

అయితే చిరంజీవి జనసేన లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కు ప్లస్ అవుతుంది అంటున్నారు రాజకీయ ప్రముఖులు. పవన్ తో పోలిస్తే చిరంజీవికి కాపులలో మంచి పరిచయాలు ఉన్నాయట. ఇది ఎన్నికలో ఎక్కువ సీట్లు రావడానికి దోహదపడుతుంది అని అనుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం తరపున 18 సీట్లు గెలిచిన చిరంజీవి, ఇప్పుడు జనసేన తరపున ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: