బంగాళాఖాతం లో ఏర్పడిన వాయుగుండం తో పాటు ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. భారీగా వరదలు రావడంతో ఎక్కడ చూసిన వరదలు, వాగులు పొంగడం తో చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి.. ఇక ఏపీ పరిస్థితి గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.. ఆంధ్రప్రదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో ప్రజంట్ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల చెదురుమదురు జల్లులు పడుతున్నాయి. ఈ వర్షాలు మరో 2 డేస్ కంటిన్యూ అవుతాయ ని వాతావరణ కేంద్రం తెలిపింది.


ఏపీ, యానాం లో దిగువ ట్రోపో ఆవరణము లో తూర్పు గాలులు వీయడం వల్ల.. జల్లులు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఈరోజు రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఇక ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.


ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుముల తో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.. మరో వైపు తమిళనాడు లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో లొతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.. తెలంగాణాలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తుంది.. ఏపీ ప్రజలు అప్రమత్తం గా ఉండాలని అధికారులు హెచ్చరించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: