ప్రస్తుతం సింహపురి రాజకీయాలు బాగా హీటెక్కాయి. నెల్లూరు రూరల్ రాజకీయాల్లో సంచలనం జరిగింది అని చెప్పాలి. ఉద్యమాలకు మారుపేరుగా , ప్రజల సమస్యల కోసం ఎంతటి అధికారిని అయినా ఎదిరించే నాయకుడిగా పేరున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ గత కొన్ని రోజుల క్రితం ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నదన్న కారణంగా సీఎం ను కలవడం జరిగింది. ఆ భేటీలో ఏమి జరిగిందో తెలియదు కానీ అప్పటి నుండి శ్రీధర్ రెడ్డి పార్టీలో ఉండడం సుముఖంగా లేదని తెలిసింది. ఇక రెండు రోజుల ముందే నా ఫోన్ ను ప్రభుత్వం ట్యాప్ చేస్తున్న కారణంగా ఇక వైసీపీలో ఉండడం కుదరదని చెబుతూ వచ్చారు.

అయితే ఈ మాటలను సరిగా పట్టించుకోని వైసీపీ అధిష్టానానికి నిన్న మీడియా ముందు శ్రీధర్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చాడు. వైసీపీ నుండి వెళ్ళిపోతున్నట్లు మరియు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఒప్పుకుంటే నెల్లూరు రూరల్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తాను అంటూ ప్రకటించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ నాయకులు ఈ వ్యవహారాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుగానే టీడీపీతో అన్ని విషయాలు మాట్లాడుకుని ఇప్పుడు ఫోన్ టైపింగ్ అంటూ అబద్దాలు చెబుతున్నారని కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న ప్రధాన విషయం... నెల్లూరు రురల్ లో ఎంతో బలంగా మారిన శ్రీధర్ రెడ్డినే వైసీపీ నుండి ఎవరు ఢీకొంటారు...

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం శ్రీధర్ రెడ్డిని ఢీ కొట్టడానికి మరో రెడ్డికి రంగంలోకి దింపడానికి వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డికి రూరల్ లెవెల్ లో ఎంత బలం ఉందో తెలిసిందే. ఇప్పటి వరకు తెలుస్తున్న ప్రకారం నెలోరె రురల్ ఇంచార్జి గా వైసీపీ నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించనున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: