కర్నూల్ జిల్లా రాజకీయాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక్కడ గత కొన్నేళ్లుగా భూమా ఫ్యామిలీ మరియు శిల్పా ఫ్యామిలీ లదే పూర్తి హవా ఉండేది. ఆనాడు భూమా నాగిరెడ్డి నుండి నేటి వారి వారసులు భూమా అఖిల ప్రియ వరకు రాజకీయంగా ఎదగడానికి ఎంతకైనా తెగిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే తాజాగా నంద్యాల రాజకీయం మరింతగా హీటెక్కింది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి వైసీపీ తరపున శిల్పా రవిచంద్ర కిషోర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా తన ప్రత్యర్థి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందడంతో తనకు అన్ని విధాలుగా గౌరవం తగ్గి పోయింది.

గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఎమ్మెల్సీ గా మంత్రి పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. ఇక 2024 ఎన్నికలకు ఉంది సంవత్సరం మాత్రమే... ఇప్పటి నుండే రాజకీయ ప్రణాళికలలో తలమునకలై ఉన్నారు. భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డకు ప్రాతినిధ్యం వహిస్తుండగా నంద్యాలను కూడా తన కనుసన్నల్లో ఉంచుకోవాలన్న తాపత్రయంలో ఉంది. కానీ ప్రస్తుతం వైసీపీలో ఉన్న శిల్పా రవిచంద్ర కిషోర్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ ను ఆసిస్తూ పార్టీ మారనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఉందా లేదా అన్నది తెలియకపోయినా అఖిలప్రియ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఒకవేళ టీడీపీ తరపున శిల్పా రవి కిశోర్ పోటీ చేస్తే తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించి తనకు ఎలాగైనా చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. దీనితో శిల్పా రవికిశోర్ పై మాటల దాడి చేస్తోంది అఖిలప్రియ. ఇక రవి కిషోర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే టీడీపీ లోకి వెళ్లేలా ఏమీ అనిపించడం లేదని రాజకీయ ప్రముఖులు అంటున్నారు. మరి నంద్యాల లో రానున్న కాలంలో ఏమి జరగనుంది అన్నది తెలియాల్సి ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: