ఊహించని దెబ్బపడితే దాని షాకనే అంటారు. తాజా ఢిల్లీ టూర్ లో చంద్రబాబునాయుడుకు తగిలిందాన్ని షాకనే అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళింది ఒక పనిమీదైతే ఎదురైంది మరొకటట. అందుకనే ఏమీ మాట్లాడుకుండా ఢిల్లీ నుండి హైదరాబాద్ కు తిరిగొచ్చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే జరుగుతున్న ప్రచారం ప్రకారమైతే అమిత్ షా అపాయిట్మెంట్ ఇచ్చి చంద్రబాబును రమ్మనలేదు. అలాగే చంద్రబాబు కూడా అమిత్ అపాయిట్మెంట్ కోరలేదు.





ఎందుకంటే గడచిన ఐదేళ్ళుగా ఎంతప్రయత్నించినా నరేంద్రమోడీ, అమిత్ షాలు చంద్రబాబును కలవటానికి ఇష్టపడలేదు. అందుకనే ఇపుడు ఇంత హఠాత్తుగా చంద్రబాబు ఢిల్లీ ప్రయాణమేంటి ? అమిత్ షాతో భేటీ ఏమిటని చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే తర్వాత తెలిసింది ఏమిటంటే ఎల్లోమీడియా యాజమాన్యం తరపున అమిత్ షా తో మంతనాలు జరపటానికి చంద్రబాబు దూతగా వెళ్ళారట. యాజమాన్యమే అమిత్ తో మాట్లాడి అపాయిట్మెంట్ తీసుకుని తమ తరపున చంద్రబాబు వచ్చి అన్నీ విషయాలు మాట్లాడుతారని రిక్వెస్టు చేసుకున్నారట. దాంతో కాదనలేక అమిత్ ఓకే చెప్పారట.




దాని ఫలితమే చంద్రబాబు సడెన్ గా ఢిల్లీ ప్రయాణం. ఎలాగూ అమిత్ ను కలుస్తున్నాం కాబట్టి స్వామి కార్యం, స్వకార్యం చేసుకోవాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయట. తమపైన నమోదైన కేసులపై మాట్లాడి అరెస్టుభయాన్ని తొలగించేట్లుగా జగన్మోహన్ రెడ్డితో చెప్పించాలన్నది యాజమాన్యం ఆలోచనగా తెలుస్తోంది. అయితే అంతావిన్న తర్వాత అమిత్ మాట్లాడుతు యాజమాన్యం గ్రూపు వాటాల్లో తమకు 51 శాతం అమ్మేస్తే సమస్యల్లో నుండి బయటపడొచ్చు కదాని ఆఫర్ ఇచ్చారట.





ఈ ప్రతిపాదనను చంద్రబాబు ఏమాత్రం ఊహించలేదట. యాజమాన్యం వాటాలో 51 శాతం ఇచ్చేస్తే ఇక ఇన్ని దశాబ్దాలు కష్టపడి సంపాదించుకున్న ఆధిపత్యం ఏమైపోవాలి ? దీన్ని అడ్డంపెట్టుకునే కదా దశాబ్దాల పాటు అడ్డదిడ్డమైన పనులు చేసిందన్నది యాజమాన్యం ఆలోచన. అందుకనే ఆఫర్ పై ఏమీ చెప్పకుండానే వెనక్కు వచ్చేయమని చెప్పారట. దాంతో షాక్ తిన్న చంద్రబాబు ఏమీచేయలేక హైదరాబాద్ వచ్చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: