అయితే సింగపూర్ లో మంత్రి ఈశ్వరన్ అనే మంత్రి అరెస్టయితే ఇక్కడి వారికి ఏం సంబంధం అని అనుకోవచ్చు. ఇక్కడే అసలైన లాజిక్ దాగి ఉంది. అయితే చంద్రబాబును ప్రొజెక్టు చేసుకొస్తున్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు ఈశ్వరన్ కు డబ్బులు పంపినట్లు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కూడా సింగపూర్ కేసులో ఇరుక్కుపోయారని వారిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
సింగపూర్ ప్రభుత్వమే అమరావతి ప్రాజెక్టు చేపడుతుందని గతంలో చంద్రబాబు అన్నారు. అయితే సింగపూర్ లో ప్రయివేటు కన్సార్టియంకు.. ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా ఈశ్వరన్ ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఈశ్వరన్ బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి ఈశ్వరన్ అకౌంట్ లోకి భారీగా డబ్బులు వెళ్లాయని తెలుస్తోంది. ఈశ్వరన్ ఖాతా నుంచి ప్రముఖ సినీ నటుడు భార్య ఖాతాలోకి రూ.1800 కోట్ల వరకు మళ్లించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ లో ఉన్న ఆమెను అక్కడి పోలీసులు విచారణ చేస్తున్నారని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
అయితే పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా, రాజకీయంగా దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఒక భాగంగా ఇది కనిపిస్తోంది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా టీడీపీ, వైసీపీ నాయకులు వాట్సాప్ లలో తెగ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి కైనా పవన్ టీడీపీ నాయకులతో చాలా జాగ్రత్తగా ఉండాలని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కు రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని వాటిని ధీటుగా ఎదుర్కొవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి