
దానిలో భాగంగానే చైనా పక్క దేశం పైకి యుద్ధానికి వెళ్లాలని సంకల్పించింది. దాంతో చైనా ప్రభుత్వం తన సైన్యాన్ని ఈ యుద్ధ సన్నాహాల్లో నిమగ్నమయ్యేలా చేసిందట. సైనిక అధికారి చైనాలో అధ్యక్షుడు కావడంతో ఈ ప్రక్రియ కూడా సులభంగానే జరిగిపోయిందట. ప్రత్యేకించి చైనా అధ్యక్షుడు జింపింగ్ ఎవరైనా తన దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చినట్లు అనిపిస్తే, వెంటనే వారి దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తాడట.
ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన ఎటూ మాజీ సైనిక అధికారి కాబట్టి పక్క దేశాలపైకి యుద్ధానికి వెళ్లే విధంగా తన దేశాన్ని సిద్ధం చేస్తాడట. అది ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఆట ఆయనకి. తాజాగా చైనాకు సంబంధించిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన యుద్ధ విమానాలు తైవాన్ పైకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇలా చైనాకు సంబంధించిన యుద్ధ విమానాలు తైవాన్ గగన తలంలోకి సూటిగా ప్రయాణించాయట.
అది కూడా క్రింద నుండి వెళ్తూ అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించాయట. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భయాన్ని కలిగించాయట. తమ పైకి చైనా దాడి చేస్తుందని తెలిసినవారు ఆందోళనకు గురయ్యారని తెలుస్తుంది. అయితే నిజంగా ఇలా ఆక్రమించుకునే వాడే అయితే చైనా అధ్యక్షుడు ఎప్పుడో ఆక్రమించుకునే వాడట. ప్రపంచ దేశాల ఆంక్షలు వల్లే, ఇరాన్ , రష్యాలు ఎంతో ఇబ్బంది పడ్డాయట. కానీ వాళ్ళు స్వశక్తితో తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న చైనాపై ఆంక్షలు పడితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందట.