భారత్ సాధారణంగా అయితే బుద్ధుడిలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అవతల వాళ్ళు దౌర్జన్యంగా మీద పడిపోతుంటే మాత్రం యుద్ధానికి సై అంటుంది. అవతలి వాళ్లు యుద్ధమే కావాలని కోరుకుంటే, అదే వాళ్ళ చివరి కోరిక అయ్యేలా చేస్తుంది. భారత ప్రధానమంత్రిని చంపేస్తానని హడావుడి చేసిన హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది. అసలు ఆ వ్యక్తిని ఎవరు చంపారో కూడా స్పష్టంగా తెలియడం లేదు.


అయితే దీని వెనకాల  భారత్ కు చెందిన రా విభాగం హస్తం ఉందని అంటున్నారు. భారత్ పైన దాడి చేయాలని చూస్తున్న వాళ్ళందరూ కూడా దిక్కులేని చావు చేస్తున్నారు.  భారత్ ను ముక్కలు  చేయాలని ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ వాళ్లు  కూడా ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా చనిపోతున్నారు. అయితే యాక్సిడెంట్ల లో చనిపోతున్నారు లేదంటే హత్య చేయబడుతున్నారు.    


పోకిరి సినిమా క్లైమాక్స్ లో నాజర్ ఒక డైలాగ్ చెప్తారు. నా కొడుకు సైలెంట్ గా నీలాంటి కలుపు మొక్కల్ని ఏరేసే వ్యవసాయం చేస్తున్నాడు అని. ఇప్పుడు భారత్ కూడా ఇదే రకంగా వ్యవహరిస్తుంది. సైలెంట్ గా ఉంటూనే భారతదేశం అనే పంట చేనుకు చెదలు పట్టిస్తున్న కలుపు మొక్కల్ని ఏరి పారేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఎవరు చంపుతున్నారో తెలియకుండానే తప్పు చేసిన వాళ్ళందరూ చనిపోవడం జరుగుతుంది.


దీంతో తప్పు చేయాలంటేనే భయపడే విధంగా  శత్రువుల గుండెలో ఒక అలెర్ట్ ను తీసుకువచ్చింది భారత కేంద్ర ప్రభుత్వం. మొన్న మన సైన్యాన్ని హతమార్చిన దుండగులను కూడా డ్రోన్లు సహాయం తీసుకుని మరి లేపేస్తుంది భారత సైన్యం. ఇప్పటికే కెనడాలో ఒక వ్యక్తిని సైలెంట్ గా లేపేసింది. ఇంకా అక్కడ ఇలా ఇద్దరు ముగ్గురు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే తాజాగా కేంద్రమంత్రి ఒకరు శత్రువులు భారత ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారని అలా చేస్తే  వాళ్ల పిల్లలను వేరే వాళ్ళు పెంచావల్సి వస్తుందని వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: