తైవాన్ ను తమ లో కలుపుకునేందుకు చైనా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తోంది. తైవాన్ భూభాగంపై ఆధిపత్యం కోసం విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే అమెరికా సైనిక జనరల్ మార్క్ మిలే మరొకసారి చైనాకు చాలా స్పష్టమైన హెచ్చరిక పంపాడు. తైవాన్ వ్యవహారంలో మీ జోక్యానికి సమాధానం మాదే ఉంటుంది అని. ఇది ఓ రకంగా చెప్పాలంటే  చైనాకు యుద్ధ సంకేతాలు పంపినట్లే.


తైవాన్ అనేది చాలా చిన్న దేశం. ఇలాంటి చిన్న దేశం కోసం అమెరికా, చైనా లు యుద్ధం చేస్తాయా? ఆ రెండు దేశాలకు అంత అవసరం ఏముంది అంటే ఆధిపత్యం. చైనా ఆధిపత్యానికి సవాల్ విసరడానికి అమెరికాకు  ఉన్న ఏకైక అవకాశం ఇదే. యుద్ధం లో ఆధిపత్యం కోసం.
అమెరికాపై ఆర్థిక ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలన్నింటిని ఆ దేశం తిప్పి కొడుతూ వస్తోంది. ఇదే సందర్భంలో ఆయుధ, సాయుధ పరంగా అత్యంత బలమైన దేశంగా తమను గుర్తించాలనేది చైనా తాపత్రయం. 1962లో భారత్ పై జరిగిన యుద్ధంలో సాధించిన విజయాన్నే చైనా ఇప్పటి వరకు ప్రచారం చేసుకుంటుంది. ఆ తర్వాత చైనా ఏ యుద్ధం లోను విజయం సాధించ లేదు. అంటే ఎవరితోను యుద్ధం చేయలేదు. కానీ తమకు తాము బలమైన దేశంగా చెప్పుకుంటోంది.  


అమెరికా ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో ఇరాక్ పై  గెలిచింది. కానీ అఫ్గానిస్థాన్ లో గెలిచి ఓడింది. సుదీర్ఘంగా 20 ఏళ్ల పాటు పోరాటం కొనసాగించి ఆ తర్వాత వెనక్కి వచ్చేసింది. వియత్నాం, క్యూబా లాంటి చోట్ల ఓటమి అమెరికా చేతకాని తనమే అని చైనా లో పాఠాల కింద చెప్తారు. అక్కడి ప్రజలను నమ్మిస్తుంటారు. ఈ సమయంలో అమెరికా, చైనా మధ్య యుద్ధం జరుగుతుందా.. లేదా హెచ్చరికలతో సరి పుచ్చుకుంటారా.  ఒకవేళ జరిగితే పెను విధ్వంసమే.

మరింత సమాచారం తెలుసుకోండి: