గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసింది జగనా లేక అతని డూపా అని టీడీపీ నేత నారా లోకేష్‌ అనుమానం వ్యక్తం చేశారు. పెరుమాళ్లపురం వద్ద మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించిన నారా లోకేష్‌.. పాదయాత్ర చేసింది జగనా లేక డూప్ నా అనే అనుమానం నాకు ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పెట్టిన నిబంధనలు తొలగించి వేటలో వెళ్లి చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కుడి చేత్తో 10 రూపాయిలు ఇచ్చి జగన్ ఎడమ చేత్తో 100 రూపాయిలు కొట్టేస్తున్నాడన్నారు.


విధులు, నిధులు లేని కార్పొరేషన్లు పెట్టి బిసిలకు జగన్ మోసం చేశారన్న నారా లోకేష్‌.. బీసీ మంత్రి పేషీలో పనిచేసే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే దిక్కు లేదన్నారు. మత్స్యకారులు కష్టాన్ని నమ్ముకొని బతుకుతారని.. సాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే వారు మత్స్యకారులని.. గంగమ్మని నమ్ముకొని మత్స్యకారులు జీవిస్తారని.. నారా లోకేష్‌ అన్నారు.


తెదేపా హయాంలో ఏపీ మత్స్యకారప్రదేశ్ గా మారితే జగన్ హయాంలో ఫినిష్ ఆంధ్రా అయిందన్నారు. బోటు, వలలు, డీజిల్ సబ్సిడీ, బీమా, 50 ఏళ్లకే పింఛన్, వేట నిషేదం సమయంలో సాయం, జిపీఎస్, మోపిడ్, ఐస్ బాక్సులు, వ్యాన్లు అన్ని మత్స్యకారులకు టీడీపీ సబ్సిడీలో అందించిందన్న నారా లోకేష్‌.. తెదేపా హయాంలో మత్స్యకారులకు 800 కోట్లు సబ్సిడీ రూపంలో అందించామన్నారు.


వైకాపా హయాంలో మత్స్యకారులకు చేసింది ఏమీ లేదని.. ఒక్క సబ్సిడీ కార్యక్రమం లేదని.. తుపానుతో మత్స్యకారులు, రైతులు నష్టపోతే పరామర్శించే మనస్సు జగన్ కి రాలేదని నారా లోకేష్‌ విమర్శించారు.  స్టేజ్, పరదాలు కట్టుకొని పంట పొలాలు పరిశీలించడానికి  జగన్ వెళ్లారని.. మత్స్యకారుల పొట్ట కొడుతూ జగన్ తెచ్చిన జీఓ 217 తెదేపా ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేస్తామని.. జగన్ కి బీసీలు అంటే చిన్న చూపని అందుకే 26 వేల మంది బీసీలపై కేసులు పెట్టారని నారా లోకేష్‌ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: