సీనియర్ స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకే ఒక్కడు సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీని అప్పట్లో షేక్ చేశాడు. ఇక అర్జున్ తన సొంత ఖర్చులతో తనకు హనుమంతుని పై ఉన్న భక్తితో గుడిని నిర్మించిన సంగతి తెల్సిందే. కొన్నాళ్ల క్రితం ఆ గుడి నిర్మాణం కూడా పూర్తి అయ్యి ఎంతో వైభవంగా ప్రారంభం  అయ్యింది.చాలా మంది ప్రముఖులు ఇప్పటికే అర్జున్ కట్టించిన హనుమంతుని దేవాలయం ను సందర్శించారు.తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటించారు. ఆ సందర్భంగా పలు ఆలయాలను నరేంద్ర మోడీ సందర్శించారు. ఆ సమయంలో అర్జున్ ఇంకా ఆయన కూతురు ఐశ్వర్య కలిసి మోడీని కలిశారు. అప్పుడే తన కూతురు ఐశ్వర్య తో కలిసి తాము నిర్మించిన హనుమంతుడి ఆలయంను సందర్శించాలని ప్రధాని మోడీకి అర్జున్ విజ్ఞప్తి చేశారు.అలాగే ప్రత్యేకమైన ఆంజనేయుడి చిత్ర పటాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అర్జున్ ఇంకా ఐశ్వర్య లు అందించారు.


యాక్షన్‌ కింగ్ అర్జున్ విజ్ఞప్తి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించాడని సమాచారం తెలుస్తోంది. మరోసారి తమిళనాడు వచ్చిన సమయంలో తప్పకుండా హనుమంతుడి కొత్త ఆలయంను సందర్శిస్తానని అన్నారట.ఇక ఒక వైపు ఆయోధ్య లో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రధాని మోడీని అర్జున్‌ తమ ఆంజనేయుడి ఆలయాన్ని సందర్శించాలని కోరడం అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షించింది.ఒకప్పుడు వరుస యాక్షన్ మూవీస్ తో సూపర్ స్టార్ డం అందుకున్న అర్జున్ ఈ మధ్య కాలంలో  వరుసగా విలన్ రోల్స్ లో నటిస్తున్నాడు. గతంలో హీరోగా టాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్.లియో సినిమాలో అర్జున్ పోషించిన విలన్ రోల్‌ కి చాలా మంచి గుర్తింపు దక్కింది. ఇక కేవలం తమిళ్‌ లోనే కాకుండా తెలుగు లో కూడా వరుసగా అర్జున్ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్‌ గా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: