రాష్ట్రంలో ఎన్నికల నగారా మ్రోగడంతో అధికార, ప్రతి పక్ష పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి.. బలమైన వైసీపీ పార్టీని ఎదుర్కొనడానికి ప్రధాన ప్రతి పక్షాలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిన సంగతి అందరికి తెలిసిందే.. అయితే ఇప్పటికే  ఇరు పార్టీ నేతలు ఉమ్మడిగా సమావేశం అయి పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటు చేసుకున్న సంగతి తెలిసిందే..అయితే సీట్లు సర్దుబాటు అయ్యాక టీడీపీ లో అంతర్గతంగా అసమ్మతి మొదలైంది.. టీడీపీ అధినేత సీటు దక్కని నాయకులని బుజ్జగిస్తూ వారికీ సమ్మతమైన హామీ ఇస్తూ వస్తున్నారు.. కానీ ఒక నియోజకవర్గం గురించి టీడీపీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. అదే అనపర్తి నియోజకవర్గం...తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటుపై మరో జగడం మొదలైంది. 

బీజేపీ అభ్యర్థి, మాజీ సైనికుడు శివకృష్ణంరాజుకు ఇప్పటికే టికెట్‌ కేటాయించినా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇవ్వబోతున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. అనపర్తి నుంచి టీడీపీ పోటీ చేస్తే రాజమండ్రి పార్లమెంట్‌ స్థానంలో బీజేపీ గెలుపు సులభతరం అవుతుందనే టాక్‌ కొంతకాలంగా వినిపిస్తోంది. దీంతో రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది.. టీడీపీ నుంచి అనపర్తి టికెట్‌ ఆశిస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాజమండ్రిలో ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరితో సమావేశమై చర్చలు జరిపినట్లు సమాచారం.టికెట్‌పై త్వరలోనే పూర్తి స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. సీటు విషయంపై క్లారిటీ వచ్చేవరకు నల్లమిల్లి నియోజకవర్గంలో పర్యటిస్తానని అన్నారు. తాను ఇతర పార్టీలోకి వెళ్లే ప్రసక్తేలేదని తెలిపారు.. తాను చేపట్టిన న్యాయం కోసం కార్యక్రమానికి ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే తన కార్యకర్తల నిర్ణయం మేరకే తన భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు..

ఇదిలా ఉంటే ఓ మాజీ సైనికుడైన శివకృష్ణంరాజుకు ప్రత్యక్ష రాజకీయాల్లో స్థానం కల్పించి, అనపర్తి ఎమ్మెల్యే టికెట్ ని కేటాయించడంతో  విలువలు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీ అని బీజేపీ నిరూపించుకుంది. అయితే ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మంగా మాజీ సైనికుడికి కోసం కేటాయించిన ఈ సీటును ఏపీ బీజేపీ నాయకత్వం మార్చాలని చూడటం మాజీ సైనికులను విస్మయానికి గురిచేస్తోంది. అనపర్తి నుండి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తేనే రాజమండ్రిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలుస్తారని ప్రచారం జరగడంపై మాజీ సైనికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.బీజేపీ ఇప్పటికే టికెట్‌ కేటాయించిన శివకృష్ణంరాజు తన తండ్రి వైద్యం కోసం ఆర్మీకి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని వచ్చారు.అలాగే జిల్లా బీజేపీలో క్రియాశీలకంగా మారారు. 4 సంవత్సరాలుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఆయన దృష్టి సారించారు. సంవత్సరకాలంగా అనపర్తి నియోజకవర్గ కన్వీనర్‌గా ఆయన కొనసాగుతున్నారుఇంతగా అంకితభావంతో పనిచేసిన శివకృష్ణంరాజును కాదని అనపర్తి టికెట్‌ టీడీపీ ఇవ్వాలనుకోవడంపై నియోజకవర్గ బీజేపీలో అసంతృప్తి నెలకొంది. పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొత్తులో భాగంగా బీజేపీ కి కేటాయించిన సీటును తిరిగి మార్చమనడం సమంజసం కాదని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిస్థానానికి తెలియజేశారు.. దీనితో అనపర్తి సీటు పై బీజేపీ పార్టీ వెనక్కి తగ్గేదే లేదని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: