ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నాయి.ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీ పార్టీ అధినేత సీఎం జగన్ మేనిఫెస్టోపై పూర్తి ఫోకస్ పెట్టారు.ఈ సారి ప్రజలకు ఇచ్చే హామీలు పక్కాగా అమలు చేసే అంశాలనే మేనిఫెస్టోలో పెడతామని  జగన్ తెలిపారు.దీంతో వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా మేనిఫెస్టోపై వైసీపీ పార్టీ కసరత్తు చేస్తుంది.గత ఎన్నికల మేనిఫెస్టో కొనసాగింపుతో పాటు రెండు కీలక హామీలను ప్రస్తుతం చేర్చనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.. 

ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని  మేనిఫెస్టో రూపకల్పన  జరుగుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.అయితే విపక్షాల మేనిఫెస్టోకు దీటుగానే వైసీపీ మేనిఫెస్టో ఉండబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి..జగన్ పాలనలో అందరికి సంక్షేమం అందిందని.. ప్రతి ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయండంటూ సీఎం జగన్ “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో ప్రస్తావిస్తూ వస్తున్నారు.అలాగే తాను గత ఎన్నికలలో ఇచ్చిన హామీల్లో 99శాతం అమలు చేశామని తెలియజేస్తున్నారు..త్వరలోనే ప్రస్తుత ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

ఇదిలా ఉంటే బలమైన వైసీపీ పార్టీని ఎదుర్కోనేందుకు కూటమిగా ఏర్పడిన బీజేపీ, టీడీపీ, జనసేన రాబోయే ఎన్నికలలో ఉమ్మడి మేనిఫెస్టో పై పూర్తి కసరత్తు చేస్తున్నాయి.. దీనిలో భాగంగా 'ప్రజా మేనిఫెస్టో' ను రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డీఏ కూటమి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది.టిడిపి-బిజెపి-జెఎస్‌పి కూటమి మేనిఫెస్టోపై ప్రజల సూచనలు, ఫీడ్‌బ్యాక్ పొందడానికి టోల్-ఫ్రీ వాట్సాప్ నంబర్ - 8341130393ను ప్రారంభించింది. టీడీపీ-బీజేపీ-జేఎస్పీ ఉమ్మడి మేనిఫెస్టో కోసం ప్రజాభిప్రాయం సేకరించాలని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సోమవారం తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ వాట్సాప్‌ నంబర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.మేనిఫెస్టో కమిటీ ప్రజలు పంచుకునే ఆలోచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. దేశంలో ఇంతకు ముందు ఇలా జరగలేదని, మేనిఫెస్టో ముసాయిదా ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నామని రామయ్య తెలియజేశారు.ఈ విధానం వల్ల ప్రజల కోరికలు నెరవేరుతాయని ఆయన తెలిపారు.ప్రజల అభిప్రాయాల మేరకు కూటమి మేనిఫెస్టో రూపొందిస్తామని వారు తెలిపారు. త్వరలోనే కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: