రాజకీయాల్లో మార్పులు అనేవి సహజం. ఎప్పుడు ఏ నాయకుడు ఎటు వెళ్లిపోతాడో చెప్పడం కష్టం. వారి రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైనా చేస్తారు. ఆ విధంగా ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నా కొద్ది నాయకుల ప్రచార హోరు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఆయా నియోజకవర్గాల్లో సమీకరణాలు కూడా మారుతున్నాయి. ఇదే తరుణంలో వైసిపికి నెల్లూరు కంచుకోటగా ఉంటుంది. పోయిన ఎన్నికల్లో  పూర్తిస్థాయిలో వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఈసారి అదే జిల్లా నుంచి వైసీపీకి ధిక్కారస్వరం వినిపిస్తోందట. ఏకంగా వైసీపీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులే జగన్ పై  విమర్శలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  జగన్ మీద విమర్శలు చేశారు. 

అంతేకాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇందులో మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని వీడారు. ఇలా వైసిపికి ఎన్నికలవేళ దెబ్బ మీద దెబ్బ పడిందని చెప్పవచ్చు. నెల్లూరు జిల్లా అంటే ఎంతో భరోసా కల్పించే జిల్లాగా వైసిపి భావిస్తే  అక్కడి నేతలు మాత్రం  మనసు మార్చుకొని  టిడిపి వైపు చూస్తున్నారు. ఇదే తరుణంలో  ఈసారి వైసీపీకి అక్కడ ఆదరణ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ఏకంగా 10 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన చోట  ఈసారి చాలా తగ్గే అవకాశం ఉందట. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  వైసిపికి జిల్లా మొత్తం బాస్ గా ఉండేవారు. కానీ ఆయనకు ఒక చిన్న ఇగో సమస్య వల్ల వైసీపీని వీడి  టిడిపిలోకి వెళ్ళాడు.

దీంతో అక్కడ రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయారని చెప్పవచ్చు.టీడీపీ నుంచి పార్లమెంట్ బరిలో ఉన్నటువంటి వేమిరెడ్డి వైసిపి పార్టీని వీడడంతో  అక్కడ టిడిపి కచ్చితంగా మూడు సీట్లు తమ ఖాతాలో తప్పక వేసుకుంటుందట. అంతేకాకుండా మరో మూడు సీట్లలో హోరాహోరీ ఫైట్ ఉందట. కేవలం ఒకే ఒక్క సీట్లో వైసీపీకి కాస్త గెలిచే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో నేతలను పట్టించుకోకపోవడం వల్ల అది టిడిపికి  కాస్త ప్లస్ గా మారింది. గత మూడు నెలల క్రితం ఇక్కడ రాజకీయం వేరేగా ఉండేది.  ప్రస్తుతం పూర్తిగా సైకిల్ వైపు మల్లుతోందని చెప్పవచ్చు.  ఇది ఇలాగే కొనసాగితే మాత్రం వైసిపి కంచుకోట బద్దలయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: