కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టేశారు. ఇక ఇటీవలే వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే మొన్నటికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో  ఇక మెజారిటీ స్థానాలలో విజయం సాధించిన బిజెపి.. ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అయితే ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అటు బిజెపికి ఊహించనీ ఎదురు దెబ్బ తగిలింది అన్న విషయం తెలిసిందే.


 ఎందుకంటే ఇస్ బార్ 400 పార్ అనే నినాదంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగింది బిజెపి. 370 నుంచి 400 సీట్లను తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా పెట్టుకుంది. అయితే పార్లమెంటు ఎన్నికలు పూర్తవుతున్న కొద్దీ తమకు ఇప్పటికే మెజారిటీ వచ్చిందని 370 స్థానాలకు మించి బిజెపికి రాబోతున్నాయి అని ఆ పార్టీ పెద్దలందరూ కూడా చెప్పారు. కానీ తీరా ఫలితాలు వచ్చాక చూస్తే ఇక 240 సీట్లతో సరిపెట్టుకుంది. గతంతో పోల్చి చూస్తే సీట్లు తగ్గాయ్. దీంతో ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుని చివరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే బిజెపికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎంత వచ్చింది అన్నది హాట్ టాపిక్ గా మారింది.


 కాగా కేవలం 0.7% ఓటింగ్ శాతంతోనే బిజెపి ఏకంగా 63 స్థానాలలో ఓటమి చవిచూసింది  అన్న విషయం నిపుణుల సర్వేలలో బయటపడింది. సాధారణంగా ఎలక్షన్స్ లో ఒక్క ఓటు కూడా ఎంతో కీలకం. ఇలా ఒక్క ఓటుతో ఎంతోమంది పార్టీల అభ్యర్థులు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బిజెపికి ఇలాంటిదే జరిగింది. కేవలం 0. 7% ఓటింగ్ శాతంతో 63 స్థానాలలో ఓడిపోయింది  2019 సార్వత్రిక ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించిన బిజెపి.. ఇప్పుడు 240 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2019లో 37.3% ఓటింగ్ శాతాన్ని బిజెపి సాధించగా.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో 36.6% ఓట్లను సాధించగలిగింది. అంటే కేవలం 0.7 శాతం మాత్రమే ఓట్లను కోల్పోయింది. ఇక ఈ చిన్న మార్జిన్ ఏకంగా 63 సీట్లను బిజెపికి దూరం చేసింది అన్నది ప్రస్తుతం నిపుణుల లెక్కల్లో బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: