కాంగ్రెస్ పార్టీలో... తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య సూసైడ్ చేసుకొని మరణించింది. అసలు వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూప దేవి ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రోజున అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూప... సూసైడ్ చేసుకోవడం జరిగింది.


హైదరాబాదులోని అల్వాల్ ప్రాంతం... పంచశీల కాలనీ లో... ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో లేని సమయంలో... అతని భార్య ఉరి వేసుకుని... సూసైడ్ కు పాల్పడింది. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. మేడిపల్లి సత్యం భార్య రూపా దేవి. అయితే మేడిపల్లి సత్యం సత్యం భార్య రూపా దేవి ఆత్మహత్య గురించి రకరకాల చర్చలు జరుగుతున్నాయి.


గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  మరియు ఆయన భార్య రూపాదేవి మధ్య... గొడవలు జరుగుతున్నాయట. తరచూ గొడవల కారణంగా... వారి మధ్య గ్యాప్ పెరిగినట్లు చెబుతున్నారు. అయితే తాజాగా... వారి మధ్య పెద్ద గొడవ జరగడంతో... ఈ సంఘటన జరిగినట్లు  సమాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన తెలియగానే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.... రూపా దేవి మృతదేహాన్ని కొంపల్లి లోని... ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.


ఆస్పత్రిలో రూపా దేవి పోస్టుమార్టం జరిగే ఛాన్స్ ఉంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపా దేవి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతేకాదు ఆమె గత రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని ఈ సమాచారం. మేడిపల్లి సత్యం చొప్పదని నియోజకవర్గానికి గురువారం ఉదయమే వెళ్లారట. కానీ గురువారం రాత్రి లోగా  ఈ సంఘటన జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: