- జగన్ నమ్మిన బంటుగా గుర్తింపు..
- వైసిపి పొమ్మనలేక పొగ పెడుతుందా.?
విజయసాయిరెడ్డి..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకుల్లో ఈయన పేరు తెలియని వారు ఉండరు. ఏపీలో తిరుగులేని లీడర్ గా ఎదిగిన విజయ సాయి రెడ్డి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నమ్మిన బంటుగా ఉండేవారు. ఢిల్లీలో ఎలాంటి పనులు చేయాలన్నా నాయకులను కలవాలన్నా విజయసాయిరెడ్డి తో మాత్రమే అయ్యేది. అలా ఢిల్లీ రాజకీయ నాయకులతో ఎంతో సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తూ వచ్చారు విజయ సాయి రెడ్డి. అలాంటి సాయి రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు అలంకరించారు. చివరికి వైసీపీ ఓటమి తర్వాత వయసు మీద పడడం వల్ల పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆయన చెప్పకపోయినా వైసిపి వారు ఆయనకి పొమ్మనలేక పొగ పెడుతున్నట్టే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇన్ని ఇబ్బందుల దృష్ట్యా ఆయన తప్పకుండా పాలిటిక్స్ కు బై బై చెప్తారని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం
రాజకీయ జీవితం:
విజయసాయిరెడ్డి వైయస్సార్ ఫ్యామిలీ నుంచి రాజకీయాలు నేర్చుకున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా వైయస్ రాజారెడ్డి ఎన్నో వ్యాపారాలు చేసేవారు. ఆ టైంలోనే ఆ వ్యాపార సంస్థలను చూసుకోవడానికి విజయ సాయి రెడ్డిని నియమించుకున్నారు. దీంతో విజయసాయిరెడ్డి రాజారెడ్డికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అన్ని చూసుకునేవారు. ఈ టైంలోనే రాజశేఖర్ రెడ్డి తో కూడా మంచి సన్నిహిత్యం ఏర్పడింది. అలా 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యాక విజయసాయిరెడ్డిని ఆర్బిఐ మేనేజింగ్ డైరెక్టర్ చేయాలని రాజశేఖర్ రెడ్డి భావించిన సాధ్యం కాలేదు. ఇక 2006లో సాయి రెడ్డిని టీటీడీ మండల సభ్యుడిగా నియామకం చేశారు. 2006 నుంచి 2010 వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా చేశారు. ఆ తర్వాత వైయస్సార్ హయాంలో జగన్ తో కూడా మంచి స్నేహం ఏర్పడింది. అలా జగన్ వ్యాపారంగంలో రాణించేలా విజయసాయిరెడ్డి ఎంతో సహకారం అందించారు. అలా కొనసాగుతున్న తరుణంలోనే 2009లో వైయస్సార్ మరణించడంతో రాష్ట్ర రాజకీయాలన్ని పూర్తిగా మారాయి. ఇక జగన్ ని ఎలాగైనా సీఎం పదవిలో కూర్చోబెట్టాలని ప్లాన్ వేశారు.