తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిజెపికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మద్దతు ఇవ్వటం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. అమెరికాలో రేవంత్ రెడ్డి పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్న ఓ కంపెనీని ఆయన సోదరుడు పెట్టుబడులు పెట్టారని ప్రతిపక్ష బీఆర్ ఎస్‌ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తమ్ముడు కోసమే అమెరికా వెళ్లారని తెలంగాణకు పెట్టుబడులు వస్తాయని రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు అన్ని బోగస్ అని బి. ఆర్. ఎస్ అంటోంది. దీనిపై కౌంటర్ ఇవ్వటానికి కాంగ్రెస్ ను జ‌యేష్ రంజ‌న్ తో వీడియోలు విడుదల చేయించాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి రేవంత్కు మద్దతు లభించింది. హైదరాబాదు బిజెపి ఆఫీసులో మీడియాతో ఇష్టాగోస్టి మాట్లాడిన బండి సంజయ్ రేవంత్ అమెరికా పర్యటనపై బీర్ ఎస్ ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు.


రాజకీయాల్లో ఆరోపణలు చేయాలంటే ఓ పద్ధతి ఉంటుందని బీఆర్ఎస్ కు హితువు పలికారు. రేవంత్ కు ఇంత బాగా మద్దతు పలికే బీజేపీ నేత మరొకరు కనిపించరు అన్న చర్చలు ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్నాయి. అలాగే బండి సంజయ్ మరో మాట కూడా చెప్పారు. కేటీఆర్ అరెస్ట్ గురించి కేటీఆర్ ను రేవంత్ సర్కార్ అరెస్టు చేసి తీరుతుంది అన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. పోలీసులను ఉపయోగించుకునే రేవంత్ ను .. తనను బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎలా వేధించిందో అందరూ చూశారని అన్నారు. మా ఇద్దరిని వేధించినట్టుగా ఇంకెవరిని వేధించలేదని ఇవన్నీ రేవంత్కు గుర్తుండే ఉంటాయని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. అంటే తనపై జరిగిన రాజకీయ దాడులకు రేవంత్ ఇప్పుడు సరైన ప్రతీకారం తీర్చుకోవాలని బండి సంజయ్ పరోక్షంగా కోరుతున్నట్టుగా ఉంది. అది రేవంత్ ప్రతీకారం కూడా అని బండి సంజయ్ అంటున్నారు .. మరి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కోరిక తీరుస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: