
మురళి నాయక్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మురళి నాయక్ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు మంత్రి నారా లోకేష్. అనంతరం నారా లోకేష్ మాట్లాడారు. జవాన్ మురళి నాయక్ కుటుంబానికి కేంద్ర అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మురళి నాయక్ కుటుంబానికి 50 లక్షలు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
అలాగే ఐదు ఎకరాల భూమితో పాటు ఇంటి స్థలం కోసం 300 గజాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మురళి నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు వెల్లడించారు. మురళి నాయక్ మెమోరియల్ కట్టడానికి కూడా కృషి చేస్తామన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాoస్య విగ్రహ నిర్మాణం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు