పెహల్గాంలో జరిగిన అటాక్ ఎప్పటికీ ఇండియన్స్ మర్చిపోలేనిది . పాకిస్తాన్ ఉగ్రవాదులు దారుణంగా అతి కిరాతకంగా టూరిస్ట్ ల పై చేసిన దాడి బి..ఇప్పటికీ ఆ విజువల్స్ సోషల్ మీడియాలో చూస్తే కలలో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి . కాగా ఆ తరువాత పాక్-భారత్ ల మధ్య  ఎంత యుద్ధ వాతావరణం నెలకొన్నిందో.. ఆ తర్వాత పరిస్ధితి ఎలా మారిపోయింది  అనే విషయాలు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా మనం తెలుసుకుంటూనే ఉంటున్నాం. అయితే కొంతమంది పాకిస్థానీలు ఇండియా-పాకిస్థాన్ వార్  తర్వాత కావాలనే సోషల్ మీడియాలో కొందరిని టార్గెట్ చేసి ట్రోల్ చేయడం ప్రారంభించారు.


పెహల్గాం దాడి తర్వాత భారత చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. ఆ తర్వాత చోటు తీసుకున్న పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలిసినవి.  ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత అసదిద్దున్  ఓవైసీ పై పాకిస్తాన్లో ట్రోలింగ్స్ ఎక్కువగా పెరిగాయి . దానికి కారణం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రానికి మద్దతుగా నిలిచిన కారణంగా అసదిద్దున్ ఓవైసీ పై పాకిస్తాన్లో హ్యూజ్ ట్రోలింగ్ పెరిగాయి . సోషల్ మీడియా వేదికగా ఆ ట్రోలింగ్స్ మనం ఎప్పటికప్పుడు చూస్తూనే వచ్చాం .



అయితే సోషల్ మీడియాలో తన పై ట్రోలింగ్ జరుగుతున్న విషయాల గురించి రీసెంట్గా రెస్పాండ్ అయ్యాడు అసదిద్దున్ ఓవైసీ.  ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్,  పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్షంలో భాగంగా ఉన్న ఓవైసీ దాని పై చేసిన వ్యాఖ్యలు  ప్రాధాన్యం సంతరించుకున్నాయి . ఈ మూమెంట్ లోనే పాకిస్థాన్ లో ఆయన పై హ్యూజ్ ట్రోల్లింగ్ జరిగింది. "తాను పాకిస్తాన్ కి దుళే భాయ్ (బావ)ని అని చాలా సరదాగా వ్యాఖ్యానిస్తూ పాకిస్తాన్ కి కౌంటర్ వేశారు అసదిద్దున్ ఓవైసీ .



"తాను మాత్రమే వారికి బావ ని అని.. వాళ్లకు తనంత అందంగా ఉన్న వ్యక్తి దొరకకపోవచ్చు అని.. వాళ్లకు భారత్ లో మాత్రమే తన లాంటి వ్యక్తులు కనిపిస్తారు అని ..కుసింత ఘాటుగానే చురకలంటించారు".  అలాగే తనను చూస్తూ ఉండాలి అని తన మాట వింటూ ఉండాలి అని పాకిస్తాన్ ట్రోలర్లకు ఓవైసీ ఘాటుగా సెటైర్లు వేశారు . అది మీకు జ్ఞానాన్ని పెంచుతుంది అంటూ కూడా పరోక్షకంగా వాళ్ళకి బుద్ధి లేదు అన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. సోషల్ మీడియాలో అసదిద్దున్ ఓవైసీ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఇండియన్స్ కూడా అదే విధంగా ఘాటుగా పాకిస్తాన్ నా కొడులకి కోసి కారం పెట్టాలి కామెంట్స్ పెడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: