ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటూ తెలివిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అప్పుల గురించి జగన్ టీం చేస్తున్న కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం సృష్టిస్తున్నాయి.
 
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేయకపోయినా ఏడాది కాలంలో ఎక్కువ మొత్తంలో అప్పులు చేశారు. వాస్తవానికి అప్పులు తీసుకునే విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇష్టానుసారం అప్పులు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాలకు అస్సలు సాధ్యం కాదు. వైసీపీ వాళ్లు కూటమి సర్కార్ లక్షా 51 వేల 600 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టు చెబుతోంది.
 
వైసీపీ ఇందుకు సంబంధించి కొన్ని లెక్కలు సైతం చెబుతోంది. అయితే అంత మొత్తం అప్పులు తీసుకోవడం అస్సలు సాధ్యం కాదని నిపుణులు సైతం భావిస్తున్నారు. అయితే కూటమి నేతలు నోరు మెదిపితే మాత్రమే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
 
తాము అధికారంలో ఉన్న సమయంలో అప్పులు తీసుకున్నా సంక్షేమ పథకాలను అమలు చేశామని కూటమి సర్కార్ అప్పులు తీసుకున్నా పథకాల అమలులో సైతం ఫెయిల్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు మేలు చేయడం కంటే ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు
 


మరింత సమాచారం తెలుసుకోండి: