గిరి అతని బంధువులు ముద్రగడను బంధించి ఒంటరిగా ఇంట్లోనే చిత్రహింసలు పెడుతున్నారని కూడా ఆమె ఆరోపిస్తుంది .. మీడియా కానీ సన్నిహితులు కానీ ఎవరు ముద్రగడని సంప్రదించడానికి మాట్లాడడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదని కూడా ఆమె ఆరోపణలు చేస్తుంది .. ఇది ఎంతో దారుణమని ఎంత మాత్రం సహించే విషయం కాదని క్రాంతి తన బాధను వెలకక్కింది.. రాజకీయ కారణాల కోసం ఇలా చేస్తున్నట్లయితే ఎవరిని వదిలి పెట్టనని సోదరుడికి క్రాంతి వార్నింగ్ ఇచ్చి తన తండ్రికి మెరగైన వైద్యం అందించాలని ఆమె కోరింది ..గత ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభానికి వ్యతిరేకంగా క్రాంతి మాట్లాడారు .. అలాగే జనసేన పార్టీలో ఆమె చేరారు .
ఇక ఆ సమయంలో ముద్రగడ్డ కూడా తన కూతురుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశారు .. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధాలు లేనట్టు తెలుస్తుంది అయితే ముద్రగడ్డకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ బయటకు చెప్పకపోవడం కుమార్తెను చూసేందుకు అనుమతులు ఇవ్వకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల వెన్నుపోటు దినంలో కూడా చాలామంది పాల్గొన్నారని అందరికీ థాంక్స్ చెప్తూ ముద్రగడ్డ పేరుతో లేఖ బయటకు వచ్చింది .. అనారోగ్య కారణాల వల్ల తాను ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయానని లేఖలో ప్రస్తావించారు .. అయితే ప్రస్తుతం ముద్రగడ్డ కార్యక్రమాల, ఆయన వ్యవహారాలన్నీ వైసిపి నాయకుడు ఆయన కుమారుడు గిరి చూసుకుంటున్నారు .. ముద్రగడ్డ పరిస్థితి ఎంతో విషమంగా ఉందని .. ఆయన కూతురు ఆరోపిస్తుంది .. ఇక మరి ముద్రగడ ఆరోగ్యం పై రాబోయే రోజుల్లో ఎలాంటి వార్తలు బయటికి వస్తాయో చూడాలి .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి