- ( హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

నెల్లూరు అంటే వైసిపి వైసిపి అంటే నెల్లూరు ఇది ఒకప్పటి మాట. 2024 లో జరిగిన ఎన్నికలలో ఓడలు బండ్లు అయ్యాయి .. బండ్లు ఓడ‌లు అయ్యాయి. జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు సీటును కూడా కూటమి ఎగరేసుకుపోయింది. జిల్లా అధ్యక్షుడిగా 2019లో పార్టీని గెలిపించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గత ఏడాది ఎన్నికలలో పరాజ‌యం పాలైన తర్వాత కూడా ఆ బాధ్యతలను నెత్తిన వేసుకున్నారు. అయితే ఆయన ఇటీవల కేసులలో ఇరుక్కోవడంతో జిల్లాలో పార్టీని మార్గదర్శకం చేసేవారు కరువయ్యారన్న వాదనలు ఉన్నాయి. జిల్లాలో వైసిపి ఓడిపోయినా కేడర్ మాత్రం చెక్కుచెదరలేదు. ప్రతి నియోజకవర్గంలో బలమైన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు. మేకపాటి - నల్లపరెడ్డి - ఆదాల - అనిల్ కుమార్ లాంటి సమర్ధులైన నేతలు ఉన్నారు.


అయితే వీరంతా తమ నియోజకవర్గానికి పరిమితం అవుతున్నారు. జిల్లా స్థాయిలో పార్టీని ముందుండి నడిపించడం లేదు. జిల్లాలో వైసీపీ నాయకులు అందరిని సమర్థవంతంగా ముందుకు నడిపించే నాయకుడు లేకుండా పోయారు. నెల్లూరు సిటీ , కొవ్వూరు , ఆత్మకూరు , నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నిత్యం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. మిగిలిన నియోజకవర్గాలలో ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు ముందుకు సాగటం లేదు. మేకపాటి - నల్లపురెడ్డి కుటుంబాల రూపంలో బలమైన నాయకత్వం వైసీపీకి ఉంది. అయితే ఎవ్వ‌రూ జిల్లా స్థాయిలో లీడ్ తీసుకోక‌పోవ‌డం పార్టీకి మైన‌స్ గా మారింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: