ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు .. తన విధానం ఏంటో క్లియర్ గా చెప్పుకొచ్చారు .. ఈ ప్రాజెక్టు వలన ఎవరికి నష్టం లేదని కూడా ఆయన వివరించారు .. తెలంగాణ ప్రాజెక్టులని తాను ఎప్పుడు వ్యతిరేకించలేదని కూడా చెప్పుకొచ్చారు .. అలాగే భవిష్యత్తులోను ఎప్పుడూ అడ్డుకోనని కూడా చెప్పేశారు .. ఇక ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనపై  కొర్రీలు విధించింది .. ఇద్దరు సీఎంలు భేటీ ఏర్పాటు చేయాలని కూడా భావిస్తుంది .. కేంద్రం వద్దనే తమ వాదనను వినిపించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది .. దీంతో చంద్రబాబు మరోసారి తన వైఖరి పైన కీలక ప్రకటనలు చేశారు.
 

అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం కుప్పంలో పర్యటిస్తున్నారు .. అక్కడ మాజీ సీఎం జగన్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు .. ఏమీ చేతకాని వాళ్లే శవరాజకీయాలు చేస్తారని కూడా ఆరోపణలు చేశారు .. తప్పుడు పనులు తాత్కాల్కోమని కూడా అన్నారు .. మనం చేసిన మంచి పనిలే శాశ్వతవాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు .. ప్రధానంగా తాను ఎప్పుడూ తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేయలేదని కూడా క్లారిటీ ఇచ్చారు .. కారు కింద పడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే ఓపిక కూడా లేదా అని కూడా జగన్ ను ప్రశ్నించారు .  కనీస బాధ్యత సామాజిక స్పృహా  లేకుండా ప్రవర్తిస్తారని కూడా నిలదీశారు .. అలా కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేస్తారు అంటూ చంద్రబాబు మండిపడ్డారు సింగయ్య బార్య‌ను పిలిపించి బెదిరించి రాజకీయం చేస్తారని కూడా జగన్ ప్రశ్నించారు .. ఇలా నీతి మాలిన వాళ్ళు రౌడీలో రాజకీయాల్లో ఉన్నారని కూడా ఆయన ధ్వజమెత్తారు .



ప్రజల నుంచి దోచుకోవటమే తప్ప ఇవ్వటం తెలియని వారితో రాజకీయాలు చేయాల్సి వస్తుందని చంద్రబాబు కొంత ఆందోళన చెందారు .. ప్రజలకు మంచి చేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు .. బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు .. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే రెండో రాష్ట్రాలు బాగుపడతాయని కూడా చెప్పారు తెలంగాణ ప్రాజెక్ట్ ల‌ని నేను ఎప్పుడు వ్యతిరేకించలేదని కూడా చెప్పారు .. నీటి సమస్య పరిష్కారమైతేనే తెలుగు వారు బాగుపడతారని ఆయన అన్నారు .. అలాగే బనకచర్ల ప్రాజెక్టు పై ఈనెల 11న ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది .  త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీటింగ్ కూడా జరిగే అవకాశం ఉన్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి ..

మరింత సమాచారం తెలుసుకోండి: