
ఇప్పటికి ఆరేళ్లు అవుతూ ఉన్న ఈ హత్య కేసులో అసలైన నిందితులను పట్టుకోలేకపోతున్నారు. ఈ విషయంపై స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేసిన ఆ తర్వాత వివేకానంద కుమార్తె సునీత కోరిక మేరకు సిబిఐకి ఈ కేసుని అప్పగించారు. సిబిఐ కూడా ఎన్నో ఏళ్లుగా దర్యాప్తు చేస్తూ ఉన్న ఈ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది.. అలాగే సుప్రీంకోర్టుకు సిబిఐ ఈ కేసులో తమ విచారణ పూర్తి అయ్యిందంటూ ప్రకటించింది.. ఇక కోర్టు ఏదైనా ఆదేశిస్తేనే తాము ఆ దిశగా వెళ్తామంటూ తెలిపారట.
వైఎస్ వివేకా హత్య సిబిఐ కేసు విచారణ పూర్తి అయ్యిందని చెప్పడం ఒక ఎత్తు అయితే ఫలితం ఏంటి అన్న విషయం మాత్రం ఇంకా చర్చనీయంశంగానే ఉన్నది. మరి వివేక హత్యకు పాల్పడిన వారు ఎవరనే విషయం పై సిబిఐ నుంచి ఎలాంటి జవాబు వచ్చిందనే విషయంపై ఆయన అభిమానులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఎదురు చేస్తున్నారు. ఎంతో సీరియస్ కేసు అలాగే కీలకమైన కేసులో విచారణ పూర్తి అయ్యిందని చెప్పిన ఫలానా వారు దోషులని ప్రకటించలేదు.. ఫలానా కారణాలవల్ల ఈ హత్య జరిగిందని కూడా తేల్చి చెప్పడం లేదు. దీంతో ఈ కేసులో సిపిఐ సాధించింది ఏంటి అనే ప్రశ్న మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. మరి ఈ హత్య కేసు పై పురోగతి ఏమి ఉంటుంది..సుప్రీం కోర్టు ఈ కేసులో సిబిఐ ఆదేశాలు ఏంటో చూడాలి.