టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, తమ కూటమి మరో పదిహేను సంవత్సరాల పాటు ఉంటుందని వెల్లడించారు. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమని చెప్పవచ్చు. దీంతో టీడీపీకి ముఖ్యమంత్రి పీఠం మరోసారి దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ పరిణామంపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యల ప్రకారం, ఆయన ముఖ్యమంత్రి కావడానికి మరో పదిహేను సంవత్సరాలు ఆగాల్సిందేనని, 2039 వరకు పవన్ ముఖ్యమంత్రి కాలేరని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో పవన్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలంటే 2039 వరకు వేచి చూడాల్సిందేనని, అప్పటివరకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేరని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, 'రీల్ పవర్ స్టార్' 'రియల్ స్టార్' అయ్యేది అప్పుడేనని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పవన్ రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది.

అయితే రాజకీయాలకు సంబంధించి పవన్ మనసులో ఏముందని చర్చ సైతం అభిమానుల్లో జరుగుతోంది. తనకు పదవుల కంటే  ప్రజలకు మంచి జరగడమే ముఖ్యమని పవన్ పలు సందర్భాల్లో వెల్లడించారు. 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో జనసేన సత్తా చాటిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో సైతం ఇదే మ్యాజిక్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ ను సీఎం పదవిలో చూడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

పవన్  కళ్యాణ్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తే బాగుంటుందని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.  అయితే పాలిటిక్స్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజీ సినిమాపై పెట్టుకోగా  ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: