రాజకీయ వాతావరణంలో ఎప్పుడూ సైలెంట్‌గా కనిపించే మంత్రి నారా లోకేష్ ఇప్పుడు వైసీపీ నేతలకు నిద్రలేని రాత్రులు కలిగిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడ చూసినా వైసీపీ నేతల మధ్య చర్చ ఒక్కటే – “లోకేష్ ఏమి ప్లాన్ చేస్తున్నాడు?” అని! ఆయన తండ్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, లోకేష్ తానే ప్రత్యేక టాస్క్‌లను తీసుకుని ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా “రెడ్‌బుక్” ఎఫెక్ట్ ఇప్పుడు వైసీపీ నేతల వెన్నులో చలి పుట్టిస్తోంది. రెడ్‌బుక్ నుంచి సోషల్ మీడియా దాకా లోకేష్ ప్లాన్! .. గతంలో తన యువగళం పాదయాత్ర సమయంలో లోకేష్, “ఎవరి పేర్లు రెడ్‌బుక్‌లో రాస్తానో వారు జాగ్రత్త” అని హెచ్చరించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో వైసీపీ నేతలు, కొంతమంది అధికారులు దానిని సరదాగా తీసుకున్నారు.
 

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ రెడ్‌బుక్ ఒక్కొక్కరిని తాకడం మొదలైంది. కేసులు, విచారణలు, అరెస్టులు – ఇలా వైసీపీకి చెందిన పలువురు పెద్ద నేతలు గడచిన నెలల్లో  ఉక్కిరిబిక్కిరికి లోన‌య్యారు . ఇప్పుడు అదే దూకుడుతో లోకేష్ మరో ప్లాన్‌లో ఉన్నారని సమాచారం. ఈసారి టార్గెట్ – సోషల్ మీడియా! అసభ్య పోస్టులు, దూషణలు, దారుణ వ్యాఖ్యలు చేసే వారిని కట్టడి చేయడానికి లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఇంకా కమిటీ పని మొదలుపెట్టకముందే వైసీపీలో చర్చలు, భయాలు మొదలయ్యాయి. “ఇది రెడ్‌బుక్ తర్వాత మరింత కఠినమైన ఆపరేషన్ అవుతుంది” అని వైసీపీ నేతలే చెబుతున్న స్థితి!  లోకేష్ మాస్టర్ ప్లాన్‌తో వైసీపీ ఉక్కిరిబిక్కిరి!.. తెలుసుకున్న సమాచారం ప్రకారం, ఈ కమిటీ త్వరలోనే నివేదిక ఇవ్వనుంది. రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియాలో నియంత్రణ కోసం కొత్త నిబంధనలు తీసుకురావడమే దీని ఉద్దేశ్యం.

 

మొదట్లో చట్టం తీసుకురావాలని యోచించినా, ఇప్పుడు నిబంధనల ద్వారా నియంత్రణ విధానం అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారట. హోంశాఖ దీనిపై జీ.ఓ జారీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వైసీపీ నేతలకు భయం ఒక్కటే - “లోకేష్ ఏ లైన్‌లో రూల్స్ తీసుకురాబోతున్నాడు?” అన్నది. గతంలో రెడ్‌బుక్ కింద ఎవరు తప్పించుకోలేకపోయారో, ఇప్పుడు సోషల్ మీడియా నియంత్రణలోనూ అదే స్థాయిలో కట్టడి వస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో నారా లోకేష్ పేరు వినగానే వైసీపీ నేతల్లో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు పూర్తి కట్టడి మోడ్‌లోకి వెళ్తుండగా, లోకేష్ ఒక్క ప్లాన్‌తోనే వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ నేతల దుస్థితిని వర్ణించే మాటగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: