జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికకు సంబంధిం  చి న ఎలక్షన్ తేదీ మరియు అందుకు సంబంధిం చిన షెడ్యూల్ మొత్తాన్ని నిన్న ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన విషయం మ న అందరి కి తెలిసిందే. ఇక ఎలక్షన్ కమిషన్ తాజాగా విడుదల చే సి న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్ర కారం చూసినట్ల యితే నవం బర్ 11 వ తేదీన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను నిర్వ హించనున్నట్లు , అందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపును నవంబర్ 14 వ తేదీన కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహించనున్నట్లు తాజాగా ఎలక్షన్ కమిషన్ అధికారులు చెప్పుకొచ్చారు.

 అలాగే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో ప్రస్తుతం నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు , ఎవరైనా కొత్తగా ఓటు హక్కు కి అప్లై చేసుకోవాలి అనుకుంటే వారికి నిన్నటి నుండి పది రోజులు అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. దానితో ఈ రోజు నుండి కొత్తగా ఓటు హక్కు కి అప్లై చేసుకునే వారికి తొమ్మిది రోజుల గడువు ఉన్నట్లు అవుతుంది. ఇక తక్షణమే జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమలు అయినట్లు అధికారులు తెలియజేశారు.

అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్యానర్ లను , ప్లెక్సీ లను తొలగిస్తాము అని కూడా అధికారులు చెప్పుకొచ్చారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 139 కేంద్రాలలో 407 పోలింగ్ స్టేషన్ లు ఉన్నట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఎవరైనా ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని కూడా అధికారులు చెప్పుకొచ్చారు. ఇంకా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ పరిధిలో ఎన్నికలు ఎలా జరుగుతాయో ... ఎవరు గెలుస్తారో అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: