దేశమంతా ప్రస్తుతం ‘కాంతార చాప్టర్ 1’ ఫీవర్ తో మునిగిపోయింది. కన్నడలో ఈ సినిమా సునామీలా దూసుకుపోతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా అద్భుతమైన వసూళ్లు అందుకుంటోంది. ఇప్పటికే కలెక్షన్ల పరంగా ‘కాంతార’ మొదటి భాగాన్ని దాటడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల మైలురాయిని చేరే దిశగా ఈ సినిమా దూసుకుపోతోంది. అయితే హిందీ బెల్ట్‌లో మాత్రం ఈ సినిమా ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. ప్రారంభంలో నిర్మాతలు, విశ్లేషకులు ఈ సినిమా ఉత్తర భారత ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఆశించారు. డివోష‌న‌ల్ కంటెంట్‌, సాంప్రదాయ అంశాలు నార్త్ ఆడియెన్స్‌కి కూడా బలంగా కనెక్ట్ అవుతాయని భావించారు. మొదటి రెండు రోజుల్లో సాధారణ ఓపెనింగ్స్ వచ్చినా, మూడో రోజు, నాలుగో రోజు కలెక్షన్లు మెరుగయ్యాయి. ఆదివారం దాదాపు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. సోమవారం కూడా వసూళ్లు నిలకడగా కొనసాగాయి.


నిజానికి హిందీ వెర్షన్‌తోనే రూ.300 కోట్ల మార్క్ దాటుతుందని అంచనాలు వేసారు. కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తే, వసూళ్లు రూ.150 కోట్ల వద్ద ఆగే అవకాశం ఉంది. అయినా ఇది ఓ కన్నడ సినిమాకు చాలా పెద్ద విజయమే. హిందీ బెల్ట్‌లో ఇంత భారీ వసూళ్లు సాధించడం అరుదైన విషయం. పైగా ‘కాంతార చాప్టర్ 1’ విడుదలైన రోజే హిందీలో మ‌రో  సినిమా విడుదల కావడం కొంత ప్రభావం చూపింది. హిందీ ప్రేక్షకులు ఇప్పటికీ ‘కాంతార’ను తమ భాషా సినిమా కంటే ఓ కన్నడ చిత్రంగా చూస్తున్నారు. ఆ మెంటాలిటీ మారి ఉంటే, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దాదాపు రూ.800 కోట్లకు చేరే అవకాశం ఉండేది. అయినప్పటికీ ప్రస్తుత స్థితిలో కూడా ‘కాంతార చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది అనటంలో సందేహం లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: