దీంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఏకంగా సినీ కార్మికులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క డిమాండ్లను కూడా తెలుసుకొని నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చారు.. దీంతో అటు కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీలు సినీ కార్మికుల మద్దతు తమకంటే తమకు అంటూ ధీమాని తెలియజేస్తున్నారు. అలాగే బిజెపి అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి కూడా గతంలో టిడిపిలో ఉండేవారు. ఇప్పుడు సినీ పరిశ్రమతో కూడా ఆయనకు బాగానే సంబంధాలు ఉన్నాయి. దీంతో సినీ కార్మికుల మద్దతు ఆయనకు ఉందని భావిస్తున్నారు. దీంతో మూడు పార్టీలలో సినీ కార్మికులు ఎవరి వైపు ఉన్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అయితే కొన్ని చోట్ల కార్మికులు తమ డిమాండ్లతో అభ్యర్థులను నిలదీస్తున్నారు. వెంకటగిరి, బోరబండ, యూసఫ్ గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ వంటి ప్రాంతాలలో చాలామంది అద్దె ఇళ్లలోనే ఉంటున్నారని వీరికి నివాసాల కోసం చిత్రపురికాలనీలో స్థలాలు కేటాయించిన వారికి దక్కలేదని తెలుపుతున్నారు. అలా మూడు దశాబ్దాలుగా తమ సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. సినీ కార్మికులకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి 30 శాతం వేతనాలు పెంచాలని నిబంధన ఉన్నప్పటికీ, ఎవరూ పట్టించుకోలేదని రోడ్డెక్కి మరి బంద్ చేస్తే 15% మాత్రమే వేతనాలు పెంచి ఇస్తున్నారు అంటూ తెలిపారు. కార్మికుల ఖర్చులు పెరుగుతున్నాయని, వారు ఇస్తున్న జీతాలు కూడా సరిపోవడం లేదని తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా నెలలో 18 నుంచి 20 రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుందట. లైట్ మెన్, డ్రైవర్లు, సెట్ వర్కర్స్, జూనియర్ ఆర్టిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులు మరి కొంతమందికి నెల అంతా పని దొరకడం చాలా కష్టంగా ఉందని, దీంతో కుటుంబాన్ని పోషించలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తెలుపుతున్నారట. ఎన్నో ప్రభుత్వాలు మారిన తమ రాతలు మారలేదంటూ సినీ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. అందుకే ఈ ఉప ఎన్నికలలో తమ ప్రతాపం చూపించాలని చూస్తున్నారట. మరి ఇది ఏ పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి